EPAPER

YSRCP: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

YSRCP: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

Ysrcp: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో వైసీపీ నేతలు ఒకొక్కరుగా బయటకు వస్తున్నారు. పేర్ని నాని విషయం పక్కనబెడితే.. పోసాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మచ్చుకైనా కనిపించలేదు. ఎన్నికలు 100 రోజులు పూర్తి అయ్యింది. ఇన్నాళ్లూ ఎక్కడున్నారో తెలీదు. బెజవాడ వరదల్లో పత్తా లేకుండా పోయారు. కొందరేమో విదేశాలకు, మరికొందరు హైదరాబాద్‌కు వెళ్లినట్టు వార్తలొచ్చాయి. కాకపోతే లడ్డూ వివాదం వీరిని బయటకు తెచ్చింది.


తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చాలా ఇబ్బందిపడ్డారు. నేతలెవరూ అందుబాటులోకి రాలేదు. ప్రతీసారీ ఆయన ఒక్కరే మాట్లాడి ఖండిస్తున్నారు. ఈ క్రమంలో చాలా విషయాల్లో మీడియాకు దొరికిపోయారు. పొంతన లేని సమాధానాలు చెప్పారు. పదవులు అనుభవించిన నేతలు పరారీలో ఉంటారంటూ జోరుగా వార్తలు సాగాయి. అయినా సరే వారెవరూ పట్టించు కోలేదు. శుక్రవారం సాయంత్రం మీడియా ముందుకొచ్చిన జగన్, తాను తిరుమల వెళ్లలేదని చెప్పేశారు.

అంతకుముందు పార్టీలో కీలక నేతలు జగన్‌తో భేటీ అయ్యారు. ఏయే విషయాలు మీడియా ముందు మాట్లాడాలని, అసలు పాయింట్‌ను ఎలా డైవర్ట్ చేయాలనే దానిపై ఓ అంచనాకు వచ్చారు. లడ్డూ వ్యవహారంలో మొదటి నుంచి అధికార పార్టీ వైఖరి తప్పంటూ ప్రయత్నించింది. తాము చేసిందే కరెక్ట్ అని సమర్థించేందుకు నేతలు ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా. దాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు.


నార్మల్‌గా కొడాలి, వల్లభనేని, పోసాని మీడియా ముందు రావడానికి పెద్దగా ఇష్టపడ లేదట. కాకపోతే అధినేతపాటు మరికొందరు రిక్వెస్ట్ చేయడంతో బయటకు వచ్చి మాట్లాడాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారని అంటున్నారు. ఆదివారం పోసాని మీడియా ముందుకొచ్చి ఆ విషయాన్ని డైవర్ట్ చేసి నేరుగా మంత్రి నారా లోకేష్‌ను వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వీరంతా.. వరదాల్లో ఏమైపోయారు? అప్పుడు సాయానికి రాని వ్యక్తులు.. ఇప్పుడు పార్టీలో మనుగడ కోసం మీడియా ముందుకు వచ్చారా అంటూ సోషల్ మీడియాలో జోరుగా రచ్చ నడుస్తోంది. జనం వద్దు.. కానీ, ‘లడ్డు’ రాజకీయాలు కావాలా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ALSO READ: తిరుమల లడ్డు.. సిట్ దర్యాప్తు ఎంత వరకొచ్చింది? అరెస్టులు ఖాయమా?

వైసీపీ నేతల్లో మునుపటి మాదిరిగా ఫైర్ కనిపించలేదంటున్నారు ఆ పార్టీలో కొందరు నేతలు. గతంలో మాదిరిగా ప్రస్తుతం మీడియా ముందు గట్టిగా నోరెత్తే సాహసం సైతం చేయలేదు. కాకపోతే బురద జల్లడం కంటిన్యూ చేశారు. వంశీ అయితే మీడియాతో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడలేదు.  దీంతో తెర వెనుక ఏదో జరిగిందన్న చర్చ మొదలైపోయింది. సమావేశం తర్వాత నేతలు మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయారని తెలుస్తోంది.

 

Related News

Tirumala: భారీ వర్షాలకు తిరుమల వెళ్తున్నారా.. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి.. ఆ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

Prakasam Crime news: హమ్మా.. చోరీ చేసి ఎంచక్కా కొండెక్కాడు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాల్సిందే!

AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దక్కాయంటే.. ?

Pawan Kalyan: పవన్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్.. రేపే విచారణ.. అంతా సస్పెన్స్

IAS PETITIONS IN CAT : క్యాట్​కు వెళ్లిన ఐఏఎస్​లు… ఏపీలోనే ఉంటానంటున్న సృజన, తెలంగాణ కావాలంటున్న ఆమ్రపాలి

CM Chandrababu: ఏపీలో మళ్లీ వర్షాలు…! జనాల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు…

TDP Central Office : టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అనూహ్యం… కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు

Big Stories

×