India bowl out Bangladesh for 233 in 1st innings: టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండవ టెస్టులో భాగంగా… కాన్పూర్ వేదికగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. మూడు రోజుల కింద ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్ కు అడుగడుగున వర్షం అడ్డంక్కి గా మారుతోంది. మూడు రోజులుగా వర్షం పడటంతో మ్యాచ్.. ఆగిపోయింది. అయితే ఇవాళ నాలుగో రోజు.. వర్షం తగ్గడంతో… మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
అయితే ఇవాళ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత… బంగ్లాదేశ్ బాటర్లపై టీం ఇండియా బౌలర్లు విరుచుకుపడ్డారు. ఈ ధర్నాలోనే 233 వరకు బంగ్లాదేశ్ జట్టు ఆల్ అవుట్ అయింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు త్వరత్వరగానే అవుట్ అయ్యారు. బుమ్రా ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టి చెల్లారేగిపోయాడు.
Also Read: IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !
అటు మహమ్మద్ సిరాజు,రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్… చిరు రెండు వికెట్లు తీయడం జరిగింది. టీమిండి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఒక్క వికెట్ పడగొట్టాడు. అటు బంగ్లాదేశ్ బ్యాటర్లలో మేమినూల్ హక్ ఒక్కడు సెంచరీ తో రాణించగలిగాడు. ఇక.. బంగ్లాదేశ్ ఆల్ అవుట్ కావడంతో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
Also Read: IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్ క్లియర్!
ఈ తరుణంలోనే టి20 మ్యాచ్ ఆడినట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది టీం ఇండియా. రోహిత్ శర్మ మొదటి నుంచి అటాకింగ్ చేసి 23 పరుగులకు అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ ప్రస్తుతం 62 పరుగులతో దూసుకు వెళ్తున్నాడు. 38 బంతుల్లోనే రెండు సిక్స్ లు, 11 ఫోర్లు కొట్టి 62 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్. అటు గిల్ కూడా 11 పరుగులతో రాణిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా వంద పరుగులు దాటింది.