E-Paper
Advertisement

ఏపీలో ‘సర్‌’కు అంతా రెడీ.. జూన్ 15 నుంచి మొదలు, వైసీపీలో కొత్త టెన్షన్, ఆపై టెక్ ఫోర్సుకు సూచనలు?

ఏపీలో ‘సర్‌’కు అంతా రెడీ..  జూన్ 15 నుంచి మొదలు, వైసీపీలో కొత్త టెన్షన్, ఆపై టెక్ ఫోర్సుకు సూచనలు?
Advertisement

Sir in AP: ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయా? రెండేళ్లు పాత వీడియోలతో కూటమి చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ చేసిందా? ఇక వైసీపీ అసలు రంగు బయటపడనుందా? ఏపీలో జూన్ 15 నుంచి ‘సర్’ రంగం సిద్ధమైందా? ఇప్పటికే నేతలు, కార్యకర్తలకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారా? అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.

ఏపీలో ‘సర్‌’కు అంతా రెడీ.. జూన్ 15 నుంచి మొదలు

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ‘సర్’కు అంతా సిద్ధమైంది. జూన్‌ 15 నుంచి ఇంటింటి సర్వే రాష్ట్ర ఎన్నికల సిద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ-SIR షెడ్యూల్‌ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఏపీలో దాదాపు నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేయడానికి ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఈ సవరణ ప్రక్రియ ఈ ఏడాది జూలై ఒకటి అర్హత తేదీగా నిర్ణయించింది ఏపీ ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. జూలై ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు.

Advertisement

వైసీపీలో కొత్త టెన్షన్, ఆపై టెక్ ఫోర్సుకు కీలక సూచనలు?

ఓటర్ల వివరాలు పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దిగుతోంది. 46 వేల మంది బూత్ స్థాయి అధికారులు, జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటర్ల ఇళ్లకి వెళ్లి సర్వే చేస్తారు. ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల తరపున నియమించిన 68 వేల మంది బూత్ స్థాయి ఏజెంట్లు బీఎల్‌వోలకు సహాయం చేయనున్నారు.

ఇందులో నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం పారదర్శకంగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు అందరూ భాగస్వాములు కావాలని సీఈవో పేర్కొన్నారు.

ALSO READ: పెద్ద లీడర్లు తెలుసంటే ‘సో వాట్’? నిబంధనలు ఉల్లంఘిస్తే వదిలేదే లేదు.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ఈ విషయం తెలియగానే వైసీపీ కొత్త టెన్షన్ మొదలైంది. సర్ విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైసీపీ అధినేత జగన్, కార్యకర్తలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.  టెక్ ఫోర్స్ పేరుతో డిజిటల్ సైన్యాన్ని రంగంలోకి దించింది వైసీపీ. దీని కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంది.

ఇక్కడి నుంచి సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ వార్ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రతి మండలానికి టెక్ వాలంటీర్‌తో కార్యకర్తలు సమన్వయం కానున్నారు. తమ ఓటర్లను తొలగిస్తే సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయాలనే రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రత్యర్థుల ఓటర్లపై వైసీపీ టెక్ ఫోర్స్, కార్యకర్తలు గురిపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×