Tanveer Ahmed On Asia Cup 2026: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) నేపథ్యంలో టీమిండియా ఫైనల్స్ కు చేరుకుంది. బంగ్లాదేశ్ మహిళల జట్టుతో నిన్న టీమిండియా ఉమెన్స్ టీం తొలి సెమీఫైనల్స్ లో తలపడింది. దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium, Dubai) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఉమెన్స్ టీం ఇండియా 40 పరుగులు తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అయితే టీమిండియా ఫైనల్స్ కు చేరిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ చైర్మన్ గా ఉన్న జై షా (Jay Shah) కుట్రల కారణంగానే టీమిండియా పదేపదే ఫైనల్స్ కు చేరుతోందని బాంబు పేల్చారు. బంగ్లాదేశ్ మహిళల జట్టుకు డబ్బులు ఇచ్చి మరి.. టీమిండియా గెలిచేలా కుట్రలు పన్నారని ఆరోపణలు చేశారు. లేకపోతే టీమిండియా ఎలిమినేట్ అయ్యేదని వ్యాఖ్యానించారు తన్వీర్ అహ్మద్.
ఉమెన్స్ ఆసియా కప్ ఫైనల్స్ లో టీమిండియా నిలవడంపై తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. కుట్రలు చేసి టీమ్ ఇండియా ఫైనల్స్ కు చేరిందని ఆగ్రహించారు. దీని అంతటికి కారణం ఐసీసీ చైర్మన్ జై షా అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా కష్టాల్లో ఉందని గుర్తుచేసిన తన్వీర్ అహ్మద్, బీసీసీఐ అటు జై షా ఇచ్చిన డబ్బులకు ఆశపడిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కావాలనే నిన్న జరిగిన తొలి సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ ఓడిపోయిందని బాంబు పేల్చారు.
ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఉమెన్స్ టీం చాలా సులభంగా గెలిచేదని.. కానీ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కుట్రలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఫలితంగా టీమిండియా సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్ లోకి అడుగుపెట్టిందని తెలిపారు. అంతేకానీ టీమిండియాకు ఫైనల్స్ లోకి వచ్చే సత్తా లేదని పరువు తీశారు. ఇక ఫైనల్స్ లో పాకిస్తాన్ కూడా అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అక్కడ టీమిండియాను కచ్చితంగా ఓడిస్తామని శపధం చేశారు తన్వీర్ అహ్మద్.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ లో అడుగు పెట్టింది టీమిండియా. నిన్న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లు ఆడి.. 149 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 109 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయింది. దీంతో 40 పరుగులు తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది ఉమెన్స్ టీమ్ ఇండియా.