E-Paper
Advertisement

వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!

వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!
Advertisement

1980s AI Photo Trend: ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్‌, ఎక్కడ చూసినా 1980ల నాటి ఫొటోల మాదిరి కనిపించే AI చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటో ఎడిటింగ్ మోజులో పడి పర్సనల్ డేటాను హ్యాకర్ల చేతుల్లో పెడుతున్నారనే విషయాన్ని చాలామంది గ్రహించడం లేదు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘1980s AI ఫొటో ట్రెండ్’ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. కాలేజీ రోజుల్లో మా నాన్న లేదా అమ్మ ఎలా ఉండేవారో అనిపించే ఆ వింటేజ్ లుక్స్ చూసి మురిసిపోతున్నారు. కానీ, ఈ సరదా వెనుక ఒక పెద్ద సైబర్ ప్రమాదం పొంచి ఉందని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

APK ఫైళ్లతో ముప్పు..

Play Storeలో దొరకని ఈ ఫిల్టర్ల కోసం చాలామంది సోషల్ మీడియా లింకులు నమ్మి థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల నుంచి APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అసలు ఇదే హ్యాకర్లకు మనం వేసే రెడ్ కార్పెట్ వెల్కమ్. రక్షణ లేని ఇలాంటి ఫైళ్లతో మన ఫోన్ గుట్టు మొత్తం వాళ్ల చేతికి వెళ్తుంది.

బయోమెట్రిక్ డేటా చోరీ..

Advertisement

పాస్‌వర్డ్ పోతే మార్చుకోవచ్చు. కానీ మన ముఖాన్ని మార్చలేం కదా. ఈ నకిలీ యాప్‌లలో మన ఫొటోలు అప్‌లోడ్ చేయగానే, మన ముఖ కవళికలు, రెటీనా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళతాయి. భవిష్యత్తులో ఈ డేటాతో నకిలీ ఆధార్ కార్డ్‌లు లేదా డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించే ప్రమాదం ఉంది.

Also Read: యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ..

Advertisement

ఈ APK ఫైళ్లలో ఉండే కోడింగ్ చాలా ప్రమాదకరమైనది. ఇది మీ ఫోన్‌లోకి ఎక్కగానే బ్యాక్‌గ్రౌండ్‌లో సైలెంట్‌గా పనిచేస్తుంది. మీ యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తుంది. ఒక్క క్షణంలో మీ బ్యాంక్ అకౌంట్‌లో రూపాయి కూడా లేకుండా ఖాళీ చేసే టెక్నిక్ ఇది.

డేంజర్ పర్మిషన్స్..

ఫొటో ఎడిట్ చేసుకునే చిన్న యాప్‌కు మన కాంటాక్ట్స్, ఫోన్ గ్యాలరీ, మైక్రోఫోన్, ఎస్ఎంఎస్ రీడ్ చేసే పర్మిషన్లు ఎందుకు చెప్పండి? కానీ ఈ ఫేక్ యాప్‌లు అన్నీ ఆటోమేటిక్‌గా యాక్సెస్ తీసుకుంటాయి. అంతేకాదు.. మీరు ఫోన్ కీబోర్డ్ మీద టైప్ చేసే ప్రతి అక్షరాన్ని హ్యాకర్లు ఇట్టే పసిగట్టేస్తారు.

సేఫ్ ట్రెండ్ టిప్స్..

ఈ ట్రెండ్‌లో పాల్గొనాలంటే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. అస్సలు తెలియని APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకండి. కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌ను మాత్రమే నమ్మండి. ప్రత్యామ్నాయంగా ChatGPT లాంటి వాటిలో సరైన ప్రాంప్ట్‌లు వాడి మీ వింటేజ్ ఫొటోలను భద్రంగా క్రియేట్ చేసుకోండి.

Also Read: లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

Tags

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

Big Stories

Advertisement
×