BigTV English

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు.. వైసీపీ నేతల్లో వణుకు!

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు.. వైసీపీ నేతల్లో వణుకు!

AP Liquor Scam: లిక్కర్ లింకులు మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి. రోజుకొకరు విచారణకు హాజరు కావడం…. ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో పెరిగిపోతుందంట. దీంతో నెక్స్ట్ ఎవరన్న చర్చ జిల్లాలో పొలిటికల్ సర్కిల్లో సాగుతోంది‌. అయితే అసలు లిక్కర్ కేసులో వీరికి సంబంధం ఉందా అని ఆశ్చర్యం కలిగేలా నేతలు అరెస్టు అవ్వడంతో ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఆ క్రమంలో వైసిపి లోని కొందరు సీనియర్లు సైతం అసలు ఈ జిల్లాలో ఎవరెవరికి లింకులు ఉన్నాయి అని ఆరా తీస్తున్నారంట..


వైసీపీ హయాంలో రూ.3,500 కోట్ల లిక్కర్ స్కాం

ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది. రూ. 3500 కోట్లపైగా స్కాం జరిగినట్లు గుర్తించిన సిట్ అధికారుల దర్యాప్తులో పలువురు జైలుపాలవుతున్నారు. ఇప్పటికే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కుంటున్నారు. వారితో పాటు మరో 39 వరకు సిట్ నిందితులుగా చేర్చింది.


ఎన్నికల సమయంలో లిక్కర్ నిధులు పంచారని అభియోగాలు

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్టు అయ్యారు‌.వారిద్దరూ అరెస్టు తరువాత రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ఇక చెవిరెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో వచ్చిన ముడుపులను చంద్రగిరి సహా పలు నియోజకవర్గాలో ఎన్నికల సమయంలో పంచారని అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ఉన్న వారందరిలో చిత్తూరు జిల్లాకు చెందిన వారే ఎక్కవగా ఉండటం గమనార్హం. జిల్లాలకు చెందిన మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీతో పాటు కిరణ్ కూమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్‌లపై కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే అరెస్టు అయ్యి జైల్లో ఉన్న వీరందరినీ సిట్ విచారించింది.

ఎప్పటికప్పుడు కొత్త పేర్లు వస్తుండటంతో వైసీపీలో కలవరం

ఇక అక్కడితే ఆగుతుందని జిల్లా నేతలు‌ భావిస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయట వస్తుండడంతో ఎప్పుడు ఏంఎమీ జరుగుతుందనే టెన్షన్ ఇటు నేతల్లోను కేడర్ నెలకొందట. ఇక తన వరకు ఇక కేసు రాదనుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సైతం నెల క్రితం అయనకు సిట్ నోటీసులు ఇవ్వడంతో అనారోగ్య కారణాల వల్ల వాట్సాప్ లో పంపిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే దానికి సంతృప్తి చెందని సిట్ అధికారులు నేరుగా నారాయణ స్వామి ఇంటికి వచ్చి అరుగంటల పాటు విచారణ జరిపారు. దాంతో ఇక మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నారాయణస్వామి ఇక అరెస్టు అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే సిట్ విచారణలో మద్యం పాలసీ మార్పులో ఆయన పాత్ర , అన్ లైన్ ద్వారా మద్యం బుకింగ్ లు మార్చి మ్యాన్ వల్ చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు, డిజిటల్ చెల్లింపులు ఎందుకు చేయలేదు అన్న అంశాలపై వందకు పైగా ప్రశ్నలు అడగటంమే కాకుండా టెక్నికల్ టీమ్స్ ద్వారా అయన గాడ్జెట్స్ ను పరిశోధించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో అయన వాంగ్మూలం రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే అయన చాలా ప్రశ్నలకు అంతా పైవారు చెప్పమన్నట్లు చేశానని చెప్పుకొచ్చారంట. ఆ క్రమంలో మొత్తం వ్యవహారం సీరియస్ అయ్యింది. అయితే నారాయణస్వామి ఎవరిపేర్లు చెప్పాడరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..

విజయానందరెడ్డికి సిట్ నుండి పిలుపు

ఇక నారాయణ స్వామిని విచారణతో మాత్రమే సరి పెట్టడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు‌.. అయితే ఊహించని విధంగా చిత్తూరు వైసీపీ ఇన్చార్జి విజయానందరెడ్డికి సిట్ నుండి పిలుపు రావడంతో విచారణ హాజరయ్యారు. వైసీపీ హయాంలో మద్యం డిపోల నుంచి షాపులకు తరలించేందుకు ఆయన కాంట్రాక్టు పొందారనే సమాచారం. పొరుగు రాష్ట్రాల్లో రవాణా చేసే ట్రాన్స్ పోర్ట్ కంపెనీలకు ఇస్తున్న మొత్తం కన్నా ఎక్కువకు ఈ కాంట్రాక్టు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి సూచనల మేరకు లిక్కర్ ముడుపుల్ని వైసీపీ అభ్యర్థులకు విజయానందరెడ్డి చేరవేసినట్లు సిట్ గుర్తించింది. వీటన్నింటిపై సుదీర్ఘంగా సిట్ అధికారులు ప్రశ్నించినట్లు టాక్ నడుస్తోంది‌‌. అలా జిల్లాలో నగరిలో రోజాకు ,తిరుపతి, కాళహస్తి, పూతలపట్టు, పీలేరు, జీడి నెల్లూరుకు అ నగదు చేరవేసినట్లు అనుమానిస్తున్నారంట. వీటిపై ఆయన మొదట తనకు ఏమీ తెలియదని, మద్యం సరఫరా కాంట్రాక్టు మాత్రమే చేశానని బుకాయించారంట. అయితే సిట్ అధికారులు చూపిన ఆధారాలతో గుట్టు విప్పక తప్పలేదంట. విజయానందరెడ్డిని సిట్ అధికారులు మరోసారి విచారణకు రావాలని చెప్పినట్లు సమాచారం.

కీలక నేతల విచారణలతో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్

చిత్తూరు జిల్లాలో వరుసగా వైసీపీ నేతలు సిట్ విచారణ హాజరవుతుండటంతో తర్వాత ఏం జరుగుతుందని టెన్షన్‌లో ఉన్నారట జిల్లా సీనియర్ నేతలు, క్యాడర్. జిల్లా సీనియర్ నేతల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు పార్టీ ప్రముఖులు సైతం అసలు కొన్ని విషయాలు తమకే తెలియని విధంగా ఉన్నాయంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారట. ఆ క్రమంలో అసలు జిల్లాలో ఏం జరిగిందన్న విషయాన్ని కొందరు పార్టీ సీనియర్లు జిల్లా నేతల నుంచి పూర్తిస్థాయి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం.

ఇక వీరితో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సైతం లిక్కర్ స్కామ్‌లో భాగం ఉందంటూ టిడిపి నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు జిల్లా వైసీపీలో మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయంట. ఇక ఎన్నికల సమయంలో మద్యం డిపోల నుండి వేలాది మద్యం బాటిళ్లను జిల్లాలో పంపిణీ చేశారని, అలా పంపిణీ చేసిన వాటిలో నగరిలోనే అతిపెద్ద స్థాయిలో మద్యం డంప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని దానిని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు. ఇలా రాష్ట్రంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ గా చెబుతున్న కేసులో వరుసగాచిత్తూరు జిల్లాకు సంబంధించిన నేతలే చిక్కుకోవడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట .మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ కేసులో జిల్లా వైసీపీ నేతలు ఇంకెన్ని విషమ పరీక్షలు ఎదుర్కొంటారో?

Story By Rami Reddy, Bigtv

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×