BigTV English

Ap Weather Update: ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

Ap Weather Update: ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

Southwest Monsoon Enters AP Several Parts of Rayalaseema Get Rains: ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.. ఇప్పటి వరకు వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఇక ఏపీలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడినట్లు వాతావారణ శాఖ తెలిపింది. రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు సంభవించడం వల్ల ఈ రెండు మూడు రోజులు వాతావరణం చల్లబడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దక్షిణ కోస్తాంద్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో ఆవర్తనాలు కొనసాగుతాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరించింది.


జూన్ నెలలో సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనావేస్తోంది. నేడు పలు జిల్లాలో ఓ మోస్తారు నుంచి అతిభారి వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏపీలో వైన్ షాపులు క్లోజ్, మళ్లీ ఆరున..


విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోపలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారంనాడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లాలో 47.7, చిత్తూరు జిల్లా లో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23.2, అనంతగిరిలో 22, కాకినాడ జిల్లాలో 20.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు IMD వెల్లడించింది.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×