AP CMO Officer Dhanunjaya Reddy : తాను ఎంపీగా గెలిచాక రెండు సార్లు మాత్రమే సీఎం జగన్‌ను కలవగలిగానని చెప్పుకొచ్చారు రిజైన్ చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ .బీసీలకు పెద్దపీట అంటున్న వైసీపీ ఒక బీసీ వర్గ ఎంపీ పరిస్థితి అది. అయనేంటి పార్టీలో పలువురు ముఖ్యనేతలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దొరకడం గగనమే అన్న టాక్ ఉంది. ప్రస్తుతం అభ్యర్ధులపై జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారంటున్నారు . అయితే చేస్తుంది ఆయన కాదంట సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డని పార్టీ వర్గాలే అంటున్నాయి. తాడేపల్లి ప్యాలెస్‌కు ఏ నేత వెళ్లినా ధనుంజయరెడ్డినే కలవాలంటున్నారు . ఒక వేళ జగన్ దగ్గరకు వెళ్లినా ఆయన దగ్గరకే వెళ్లాలని సూచిస్తుంటారంట. దీంతో ఆయన పెత్తనంపై వైసీపీ సీనియర్లలో సైతం తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది.
సీఎంవో ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి ఐఏఎస్ అధికారి కానీ, ఆయన ఇప్పుడు తల పండిన పొలిటీషియన్ కంటే ఎక్కువగా వైసీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ ముఖ్యనేతలే చెబుతున్నారు . వైసీపీ సుప్రీంలా మారారని కూడా అంటున్నారు. నియోజకవర్గాల ఇన్‌చార్జీల నియామకం విషయంలో ఆయన సర్వం తానే అయి నడిపిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి . ఆ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా ఉప ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ధనుంజయరెడ్డిని కలిస్తేనే పని అవుతుందని పార్టీనేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైసీపీలో ధనుంజయరెడ్డి నిర్ణయమే ఫైనల్ అని మంత్రులు, మాజీ మంత్రులు ముఖ్యనేతలూ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
పార్టీలో పంచాయతీలు సీఎం జగన్‌ను కలిస్తే పరిష్కరం అవుతాయనే గ్యారంటీ లేదంటున్నారు . ఎవరైనా తన వద్దకు వచ్చినా ధనుంజయరెడ్డి అన్నతో మాట్లాడాలని నేతలకు జగనే సూచిస్తున్నారంట. నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు ముందుగా రీజనల్ కోఆర్డినేటర్లను కలుస్తారు. ఆ తర్వాత సీఎంఓకి వెళ్తారు వారికి అక్కడ జగన్ దర్శనం దొరకదు దాంతో వారు ధనుంజయరెడ్డిని కలసి, తనను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగిస్తున్నారో లేదో తెలుసుకోవాల్సి వస్తుందంట. అప్పటికే సర్వే నివేదికలను తన దగ్గర ఉంచుకుంటున్న ధనుంజయరెడ్డి వాటి ఆధారంగా టికెట్ దక్కుతుందో లేదో అప్పటికప్పుడే చెప్పేస్తారంట.
నియోజకవర్గాల ఇన్‌చార్జిల విషయంలో జగన్ భారీ కసరత్తు చేస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే అదంతా అవాస్తం అని సీఎంఓకి వెళ్లి వచ్చిన నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ప్రముఖ నేతలతో కూడా సీఎం జగన్ ముఖాముఖీ సమావేశమవడం లేదంటున్నారు. ఎమ్మెల్యేలూ, ఎంపీలపై సర్వే నివేదికల్లో ఏముందో స్క్రూటినీ చేసేది ధనుంజయరెడ్డే అంటున్నారు. సర్వే రిపోర్టులను సుదీర్ఘంగా స్డడీ చేసి, ఎమ్మెల్యే పనితీరు బాగుందంటే దానిని ముఖ్మమంత్రి జగన్‌కు చేరవేస్తారట. కొందరిపై సర్వే నివేదిక బాగున్నప్పటికీ ప్రతిపక్ష నేతలు చంద్రబాబు ,లోకేశ్, పవన్ కల్యాణ్‌లను తిట్టిపోస్తేనే సీటు అని వారికి చెప్తున్నారన్న టాక్ ఉంది.
గతంలో భూముల ఆక్రమణలపై అసహనంతో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి హుటాహుటిన తాడేపల్లికి వచ్చారు. ఆయనను జగన్ కలుస్తారని అంతా భావించారు అయితే ధనుంజయరెడ్డితో బాలినేని సమావేశమై బయటకు వచ్చేశారు. ఈ విషయమే మాజీ మంత్రి బాలినేనిలో అసంతృప్తిని మరింత రాజేసిందని చెబుతారు.జగన్‌కి స్వయంగా బంధువైన బాలినేని పరిస్థితే అలా ఉంటే మిగిలిన నాయకుల విషయంలో ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదంటున్నారు.
వైసీపీలో ప్రస్తుతం ధనుంజయరెడ్డిదే హవా నడుస్తోందనడానికి ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. చాలాకాలంగా పార్టీలో నెంబర్ టూలా వ్యవహరిస్తూ వస్తున్నారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయి అసెంబ్లీ సెగ్మెంట్ల పంచాయతీలను కూడా తేల్చలేకపోతున్నారట. తాజాగా విజయసాయి ముందుకొచ్చిన నరసరావుపేట అసెంబ్లీ టికెట్ పంచాయతీ ఎటూ తేలలేదు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ బ్రహ్మారెడ్డి సహా ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిలో సీఎం సమక్షంలోనే ఇటీవల బ్రహ్మారెడ్డి వర్గం నిరసన కూడా వ్యక్తం చేసింది. అయితే తనకు నరసరావుపేట టికెట్‌ను సీఎం ఖరారు చేశారని గోపిరెడ్డి ఇటీవల మీడియాకు వెల్లడించారు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలు ఉంటాయంటూ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో నేతల మధ్య సయోధ్యను కుదిర్చే పనిలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. ఈ క్రమంలో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా గోపిరెడ్డిని ప్రకటించవద్దంటూ బ్రహ్మారెడ్డి వర్గం సాయిరెడ్డి సమక్షంలోనే డిమాండ్ చేసింది. అయితే గోపిరెడ్డిని నరసరావుపేట అభ్యర్థిగా సీఎం ప్రకటించారని విజయసాయి తెలిపారు. దాంతో తాము ఆయనకు మద్దతు ఇచ్చేదిలేదని బ్రహ్మారెడ్డి వర్గం తేల్చి చెప్పేసింది. దాంతో ఆ పంచాయతీలో సఖ్యత కుదర్చలేక విజయసాయి చేతులెత్తేయాల్సి వచ్చిందంట. ఇక్కడ ట్విస్ట్ ఏటంటే గోపిరెడ్డిని ఓకే చేయడం వెనుక ఉంది ధనుంజయరెడ్డే అని టాక్. మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్‌లో అలా సాగిపోతోంది రాజకీయం.
.
.