BigTV English

Tirupati Gangamma Jathara: మగవారు మహిళలయ్యే.. తిరుపతి గంగమ్మ జాతరలో బూతులే ఆశీస్సులు

Tirupati Gangamma Jathara: మగవారు మహిళలయ్యే.. తిరుపతి గంగమ్మ జాతరలో బూతులే ఆశీస్సులు

Tirupati Gangamma Jathara: 900ఏళ్ల చరిత్ర.. ఏడు రోజుల జాతర.. రోజుకో వేషాధారణ.. అమ్మవారిపై భూతుల దండకం.. ఎక్కడా లేని ఈ వింత ఆచారం.. తిరుపతికి మాత్రం సొంతం. తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ఈ విచిత్ర ఆచారాలన్నీ కనిపిస్తాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు.. రోజుకో వేషం ధరిస్తారు. మాతంగి వేషధారణ.. ఈ జాతరలో అత్యంత ముఖ్యమైంది. మగవారు.. ఆడవారిలా రెడీ అయ్యి.. అమ్మవారిని భూతులు తిడుతూ ఆలయానికి చేరుకుంటారు. ఇదే అక్కడి ఆచారం. ఇలా చేస్తే.. అమ్మవారు కోరిన కోర్కెలు తీరుస్తారని భక్తుల నమ్మకం.


ఈనెల 6 నుంచి తిరుపతి గంగమ్మ జాతర

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరను.. ప్రతి ఏటా మే నెలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈనెల 6వ తేదీన ఈ జాతర ప్రారంభమవుతుంది. గంగమ్మ తల్లి.. తిరుపతి గ్రామదేవత. కలియుగ ప్రత్యక్ష దైవ్యమై ఆ వేంకటేశ్వరస్వామి చెల్లెలిగా ఆమెను పూజిస్తారు తిరుపతి వాసులు. ఈ జాతర చాలా ప్రత్యేకమైంది. చిత్తూరు జిల్లాలోని ప్రతి గ్రామంలో గంగమ్మ జాతర జరుగుతుంది. అయితే.. ఎక్కడైనా ఒకటి, రెండు రోజులు మాత్రమే ఈ జాతర నిర్వహిస్తారు. తిరుపతిలో మాత్రమే ఏడు రోజుల పాటు జాతర జరుగుతుంది.


తాతయ్యగుంట గంగమ్మ జాతరకు 900ఏళ్ల చరిత్ర

జాతర ప్రారంభానికి ముందు రోజు చాటింపు వేస్తారు. ఒకసారి చాటింపు వేస్తే… ఆ రోజు నుంచి గ్రామస్తులు ఎవరూ బయటకు పోరు. బంధువులు కూడా ఊరిసరిహద్దులు దాటకూడదు. అయితే.. తిరుపతి మహానగరంగా మారడంతో.. కొంతమంది తప్ప.. మిగిలివారు ఈ సాంప్రదాయాన్ని పాటించడంలేదు. చాటింపు వేసేందుకు ముందు రోజు.. అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించే అవిలాలకు చెందిన ముళ్లపూడి సుబ్బరామిరెడ్డి కుటుంబసభ్యులు వారి ఇంట్లో నట్టింట పూలు, పండ్లు, చీర, రవిక, పసుపు-కుంకుమలు, గాజులు పెట్టి గంగమ్మను పూజిస్తారు. సాయంత్రం వాటిని జాగీర్‌పెట్టెలో పెట్టి… అమ్మవారి మిరాశీదార్లు అయిన కైకాల, పంబల వారితో కలిసి గంగశిల దగ్గర వెళ్తారు. ఆ సమయంలో తిరుపతి నుంచి పంచెలు తీసుకొస్తారు. ఇద్దరూ సాంగ్యాలు మార్చుకుని పూజలు చేస్తారు. పూజ పూర్తన తర్వాత… గంగమ్మ జాతర ప్రారంభమైనట్టు చాటింపు వేస్తారు. ఈ చాటింపు తిరుపతిలోని పెద్దకాపు వీధి నుంచి మొదలవుతంది. తర్వాత ఊరంతా చాటింపు వేస్తారు.

ఏడు రోజుల పాటు రోజుకో వేషాధారణ

తిరుపతి గంగమ్మ జాతరలో వేషాధారణలే ప్రత్యేకం. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో మొదటి రోజు.. బైరాగి వేషం వేస్తారు. గుడి తరపున మిరాశీదార్లు అయిన రజకులు ఈ వేషం వేస్తారు. ప్రస్తుతం దొరైరాజు అనే జ్యుడీషియల్‌ ఉద్యోగి ఈ వేషం వేశాడు. ఆయన బైరాగి వేషం వేసుకుని అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత… తిరుపతిలోని పిల్లలు ఎక్కువగా ఈ వేషం వేస్తారు. బైరాగి వేషం అంటే… శరీరమంతా విభూతి పూసుకుంటారు. కనిపించిన వారందరినీ భూతులు తిడతారు. ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అదే రోజు గారడి వేషంలో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దీనిని కైకాల వంశస్తులు, రజకులు కలసి వేస్తారు. వీరు ప్రతి ఇంటి ముందు అగినప్పుడు స్థానికులు వారి కాల్లు కడిగి పూజలు చేస్తారు.

రెండో రోజు గొల్ల వేషం, బండ వేషం

రెండో రోజు గొల్ల వేషం. దీన్ని స్థానికులు వేయరు.. మిరాశీదార్లు అయిన కైకాల వంశస్తులు, చాకలి వంశస్తులు మాత్రమే వేస్తారు. గొల్ల వేషంలో మజ్జిగ బిందెను నెత్తిన పెట్టుకుని.. అడిగిన వారందరికీ మజ్జిగ పోసుకుంటూ వెళ్తారు. అదే రోజు బండ వేషం కూడా వేస్తారు. దీన్ని స్థానికులు, మిరాశీదార్లు వేస్తారు. ఈవేషంలో భక్తులు మొడలో పూల మాల వేసుకుని.. ఒళ్లంతా కుంకుమ పూసుకుంటారు. అమ్మవారిని దర్శించుకుంటారు.

మూడో రోజు కోమటివేషం, దొర వేషం

మూడో రోజు కోమటివేషం. దీన్ని కూడా మిరాశీదార్లు మాత్రమే వేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం భక్తులు, మిరాశీదార్లు కలసి తోటి వేషం వేస్తారు. ఈ వేషంలో మహిళ వేషంలో ఉన్న వ్యక్తి తలపై గంప పెట్టుకుంటారు. చాట తీసుకుని భక్తుల నెత్తిన కొడుతూ వెళ్తాడు. ఈ వేషంలో ఉపయోగించే గంప, చాట, శేషావస్త్రాలు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వస్తాయి. తోటి వేషం వేసుకున్న స్థానికులు.. ఒళ్లంతా బొగ్గుపొడిని పూసుకుని తెల్లనామం సాది కనుబొమ్మల పైన చుక్కలు పెట్టుకుంటారు. మీసాలు కూడా పెడతారు. పొరక, చాట పట్టుకుని ఎదురుపడ్డ వారందని కొడతారు.

అదే రోజు.. దొర వేషం

అదే రోజు.. దొర వేషం కూడా ఉంటుంది. ఈ వేషాన్ని… కైకాల, చాకలి వంశస్తులు వేస్తారు. ఈ వేషంలో మహిళ పాత్ర ఉండదు. కైకాల కులస్తుడు దొర వేషం, చాకలి కులస్తుడు మంత్రి వేషం వేస్తారు. తోటివాడు పాలెగాడి కొయ్య తలను పట్టుకోని నడుస్తారు. ప్రజలను వేధిస్తున్న పాలేగాడి తలను అమ్మవారు ఖండించదని… అందుకు ప్రతీకగా ఈ వేషం వేస్తారని పురాణాలు చెప్తున్నాయి.

నాలుగో రోజు మాతంగి వేషం

నాలుగో రోజు మాతంగి వేషం.. ఈ వేషంలో పురుషులు స్త్రీవేషం ధరిస్తారు. మొడలో పూలహారం వేసుకుని ఒడిబాల కట్టుకుంటారు. ముందుగా కైకాల వంశస్తులు మాత్రమే ఈ వేషం వేస్తారు. ఆ తర్వాత మొక్కు తీర్చుకోవడం కోసం చాలమంది ఈ వేషం వేస్తారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

ఐదో రోజు సున్నపు కుండల వేషం

సున్నపు కుండల వేషం.. జాతరకు ముందు రోజు ఉంటుంది. కైకాల వంశస్తులు వేసిన తర్వాత మిగతా భక్తులు వేస్తారు. సున్నపు కుండలకు రంధ్రాలు పెట్టి.. అందులో సాంబ్రాణి వేసి ముఖానికి బొట్లు పెట్టుకుని గుడిచుట్టు తిరుగుతారు. కుండలో కర్పూరం వెలిగించి కూడా గుడిచుట్టు తిరిగి మొక్కులు తీర్చుకుంటారు. గుడిచుట్టూ తిరిగిన తర్వాత అదే కుండతో దిష్టి తీయించుకుని కుండలను పగలకొడతారు.

చివరి రోజు పేరంటాల వేషం

జాతర చివరి రోజు.. అతిముఖ్యమైంది. ఆ రోజు సప్పరాలతో ప్రజలు మొక్కుబడి తీర్చుకుంటారు. సప్పరాలు కట్టే వారు.. ముందు రోజు నుంచి నియమనిష్టలతో ఉంటారు. ఒళ్లంతా గంధం పూసుకుని.. తెల్లబనీను వేసుకుని.. తలపాగా ధరిస్తారు. మల్లెపూలు చేతికి చుట్టుకుంటారు. సప్పరాన్ని తలపై పెట్టుకుని వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అదే రోజు అమ్మవారికి పొంగళ్లు పొంగిస్తారు. జంతు బలులు ఇస్తారు.

విశ్వరూపదర్శనం, చంప నరుకుడుతో జాతర పూర్తి

చివరి రోజు పేరంటాల వేషం కూడా వేస్తారు. అమ్మవారి విశ్వరూపదర్శనానికి ముందు కైకాలవంశస్తుడు పేరంటాల వేషం వేసుకుని ఉరేగింపుగా వస్తాడు. అప్పటికే ఆలయం ముందు అమ్మవారి విశ్వరూపాన్ని అవిలాల చెరువు మట్టితో తయారు చేసి పూజలు చేసుంటారు. తెల్లవారజామున ఆలయానికి చెరుకున్న పెరంటాళ్లు తన దగ్గరనున్న కత్తితో.. అమ్మవారి మట్టి ప్రతిమలోని చెంప నరుకుతాడు. దీంతో జాతర ముగుస్తుంది. ఆ మట్టిని పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఆ మట్టి కోసం పోటీ పడతారు.

తిరుపతి గంగమ్మ జాతరలో వింత ఆచారం

తిరుపతి గంగమ్మ జాతరలో ఈ వేషాలే కాదు.. మొక్కులు తీర్చుకోవడానికి అనేక వేషాలు వేస్తుంటారు. ప్రస్తుతం.. పుష్పలో అల్లుఅర్జున్ వేసిన మాతంగి గెటప్‌ చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలమంది ఆ గెటప్‌లు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. దీంతో పాటు పులివేషాలు, జానపద వేషాలు, కృష్ణుడు, రాముడు, ఈశ్వరుడు, అమ్మవారు.. ఇలా ఇష్టదేవత వేషాలతోనూ అమ్మవారిన దర్శించుంటారు.

విశ్వరూపదర్శనం, చంప నరుకుడుతో జాతర పూర్తి

మొత్తంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. తిరుపతి వీధులు సందడిగా మారిపోతాయి. ఎటు చూసినా… ఎవరిని చూసిని వెరైటీ వేషధారణలతోనే కనిపిస్తారు. పాశ్చాత్య నాగరికత వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో.. ఇలాంటి జాతరలు మన సంప్రదాయాన్ని నిలబెడతాయని అశిద్దాం.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×