Hyderabad News: అదిగో పులి.. ఇదిగో మేక అన్నట్లు ఉంది మధురానగర్ కేసు వ్యవహారం. యజమాని ప్రాణం తీసిన పెంపుడు కుక్క వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన వెనుక యజమాని పవన్ అనారోగ్యం కారణమని తేలింది.
నిజం తెలుసుకునే లోపు.. అబద్దం గుమ్మం దాటిపోతుందన్న సామెత మాదిరిగా జరిగింది. హైదరాబాద్‌లోని మధురానగర్ ప్రాంతంలో యజమాని పవన్ కుమార్ మృతి వ్యవహారం. పెంపుడు కుక్క యజమాని ప్రైవేటు పార్ట్స్ కొరకడం వల్లే చనిపోయిందని రోజంతా వార్తలు హంగామా చేశాయి. చివరకు లోగుట్టు బయట పడింది.
మిస్టరీ వీడింది
పవన్ కుమార్ మృతి కేసు అసలు మిస్టరీ వీడింది. అనారోగ్యం కారణంతో పవన్ మృతి చెందినట్టు నిర్ధారణ వచ్చారు పోలీసులు. యజమానిని కాపాడేందుకు పెంపుడు కుక్క తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైంది. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పవన్ మృతికి పెంపుడు కుక్క కాదని తేలిపోయింది.
ఏపీలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పవన్ కుమార్ గడిచిన పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బంగారం షాపులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిపడుతున్నాడు. కొన్నిరోజుల కిందట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు పవన్. రెండురోజుల కిందట డిశ్చార్జ్ అయ్యాడు.
ALSO READ: బీహార్ లో రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి
ఇదీ అసలు కథ
తీవ్రమైన శ్వాస సమస్యలతో ఆయన బాధపడుతున్నాడు. శనివారం రాత్రి అనారోగ్యం కారణంగా నిద్రపోని పవన్, ఆదివారం తెల్లవారుజామున మరణించి ఉండవచ్చని అంటున్నారు. పోస్టుమార్టంలో పవన్ గుండెలో రక్తం గడ్డకట్టిందని తేలింది.
పెంపుడు కుక్కకు యజమాని బలైపోయాడన్న వార్త తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. పవన్ రూమ్ మేట్ సందీప్ నుంచి కొన్నివిషయాలు సేకరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పవన్, ఆసుపత్రికి వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత శనివారం రాత్రి 11 గంటల సమయంలో తన రూమ్‌కి వెళ్లాడని, అతడి పక్కనే పెంపుడు కుక్క నిద్రపోయిందన్నాడు.
రూమ్‌మేట్ వెర్షన్ ప్రకారం..
పవన్ తన బెడ్ రూమ్ తలుపు లోపలి నుండి గడియ వేసి కుక్కతో ఒంటరిగా ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం వరకు పవన్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో రూమ్ మేట్‌కు సందీప్ అనుమానం వచ్చింది. అప్పుడు సందీప్ ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేశారు. బయట నుంచి చూసిన ఆ వ్యక్తులకు పెంపుడు కుక్క నోటి వద్ద రక్తపు మరకలు ఉండడంతో ప్రైవేటు పార్ట్స్‌ని కొరికి చంపిందని భావించారు.
ఆపై పోలీసులను సమాచారం ఇచ్చారు. అప్పుడు పవన్ మృతి విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా పవన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పెంపుడు కుక్క నోరు రక్తంతో తడిసిపోయి ఉంది. అయితే పవన్‌ను బతికించేందుకు కుక్క తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైందని అంటున్నారు. మొత్తానికి పవన్ కేసు ఆ విధంగా ముగిసింది.