BigTV English

Pakistan Turkey Legacy: పాకిస్తాన్‌కు టర్కీ ఎందుకు మద్దతు ఇస్తోంది? వీరి దోస్తీకి కారణాలు ఏమిటి?

Pakistan Turkey Legacy: పాకిస్తాన్‌కు టర్కీ ఎందుకు మద్దతు ఇస్తోంది? వీరి దోస్తీకి కారణాలు ఏమిటి?

Pakistan Turkey Legacy| జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్ తమపై దాడి ఎప్పుడైనా చేయవచ్చునని పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడికి బాధ్యులని భారత ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్తాన్ భయం వ్యక్తం చేసింది. అయితే దాడితో తమకు సంబంధం లేదని, భారత్ ఆరోపణలు నిరాధారమని పాక్ ఖండిస్తోంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పాక్ ఆహ్వానం ఇచ్చినప్పటికీ భారత్ స్పందించకపోవడం పాక్ విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ఇప్పటికే చైనా, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలతో సంప్రదింపులు ప్రారంభించింది.


ఇలాంటి సమయంలో టర్కీ సైనిక ఉన్నతాధికారి యాసర్ కడియొగ్లు పాకిస్తాన్‌కి వచ్చి, అక్కడి వైమానిక దళ చీఫ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆయుధాల సరఫరా, శిక్షణ, శాటిలైట్, ఇంటెలిజెన్స్ సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. భారత్‌తో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా టర్కీ దేశం యుద్ధ నౌక పాకిస్తాన్ సమీపంలో ఉంది. ఒకవేళ భారత్, పాకిస్తాన్ యుద్ధం చేస్తే టర్కీ.. పాకిస్తాన్ తరపున యుద్ధం చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ రెండు దేశాల స్నేహ బంధానికి పురాతన కారణాలున్నాయి. రెండు ముస్లిం దేశాలు కావడం, వీటి చరిత్ర, అంతర్జాతీయ స్థాయిలో ఇరువురి లక్ష్యాలు చాలా కామన్ గా ఉండడంతో ఈ రెండు దేశాలు చాలా అంశాలపై సారూప్యత కలిగి ఉన్నాయి. ఆయుధాల సరఫరా, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, అంతర్జాతీయ దౌత్య విధానాలు లాంటి అంశాలతో పాటు పలు ఇతర అంశాల్లో కూడా పాకిస్తాన్ కు టర్కీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతోంది.

టర్కీ, పాకిస్తాన్ చరిత్ర
పాకిస్తాన్ అనే దేశం.. భారత్ నుంచి విడిపోయి 1947లో ఏర్పడింది. కానీ టర్కీలో పాకిస్తాన్ స్నేహం అంతకంటే పురతానమైనది. ఎందుకంటే ఖిలాఫత్ ఉద్యమం కోసం టర్కీలో యుద్ధం జరిగిన సమయంలో బ్రిటీష పరిపాలనలో ఉన్న భారతదేశపు ముస్లింలు టర్కీ దేశానికి అండగా నిలబడ్డారు. ఖిలాఫత్ ఉద్యమం కోసం భారత దేశం (పాకిస్తాన్ విడిపోక ముందు) నుంచి టర్కీ దేశానికి ధనం, ఇతర సాయం అందించారు. ఆనాడు చేసిన సాయం ఇప్పటికీ టర్కీ మర్చిపోలేదు. అయితే భారతదేశానికి బ్రిటషర్ల నుంచి స్వాతంత్ర్యం వచ్చాక పాకిస్తాన్ ఏర్పడింది. ఆ సమయంలో పాకిస్తాన్ అంటే భారతదేశంలోని ముస్లింలకు ప్రతీక అనే భావన ప్రపంచదేశాల్లో ఉండేది. దీనికి కారణం.. మత ప్రాతిపదికన భారత్, పాకిస్తాన్ దేశాలు విడిపోవడం. ఆ నాడు అది జిన్నా, నెహ్రూలు రాజకీయంగా తీసుకున్న నిర్ణయమే అయినా పాకిస్తాన్ దేశమంటే భారతదేశంలోని ముస్లింల కోసం ఏర్పడిన ప్రత్యేక దేశం అనే భావన ఉండేది. టర్కీ దేశం.. పాకిస్తాన్ ను ప్రపంచంలోనే ఒక ప్రత్యేక దేశంగా గుర్తింంచిన మొట్టమొదటి దేశం. పాకిస్తాన్ కరెన్సీని ముద్రించడానికి టర్కీ సాయం కూడా చేసింది. ఆ సమయంలో టర్కీ ప్రెసిడెంట్ గా ఉన్న అటాతుర్క్ తో పాకిస్తాన్ స్థాపకుడు జిన్నాకు మధ్య మంచి స్నేహం ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత నాశనమైన టర్కీని తిరిగి గాడిలో పెట్టిన సమర్థుడు అటాతుర్క్. ఆయన అన్ని విధాలుగా పాకిస్తాన్ కు అండగా నిలిచాడు. జిన్నాకు కావాల్సిన సాయం అందించాడు.


Also Read: పాకిస్థాన్‌కు అండగా డ్రాగన్ దేశం.. అత్యధిక ఆయుధాలు చైనా నుంచే సరఫరా

టర్కీ, పాకిస్తాన్ దేశాల మతం, సంస్కృతి
పాకిస్తాన్, టర్కీ.. ఇవి రెండూ కూడా ముస్లిం మెజారిటీ దేశాలు. ఇక్కడ అత్యధిక జనాభా ముస్లింలే. అందుకే ప్రపంచంలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరు దేశాలు సంయుక్తంగా వ్యతిరేకించాయి. పాలస్తీనా ముస్లింలు, ప్రపంచంలో ఇస్లాంపై ఉన్న వ్యతిరేకత అనే సమస్యలను రెండు దేశాలు కలిసి ఎదుర్కొన్నాయి. ప్రస్తుత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాకిస్తాన్ తనకు రెండో ఇల్లు అని పలు మార్లు చెప్పారు. రెండు దేశాల్లో సంస్కృతి పరంగా కాస్త విభిన్నమైనా.. ఒకరి సంస్కృతి పట్ల మరొకరు అత్యున్నత గౌరవ భావం చూపిస్తారు.

ఇస్లాం మత ప్రవక్త మొహమ్మద్, ఆయన సమకాలీనులు అంతం తరువాత ఇస్లాం రాజులు అవినీతి మయంగా శాసనం కొనసాగించారు. ఈ దశంలో మళ్లీ ఖలీఫా రాజ్య స్థాపన చేసింది టర్కీ దేశస్థులే. వందల ఏళ్ల వరకు ఒట్టోమాన్ రాజ్యం నిజాయితీకి ప్రతీకగా.. సువర్ణ రాజ్యంగా వర్ధిల్లింది.అయితే కాలాంతరంలో ఆ ఒట్టోమాన్ రాజ్యం కూడా రెండో ప్రపంచ యుద్ధంలో కుప్పకూలింది. ఒట్టోమాన్ సామాజ్య గాధని టర్కీ దేశాస్థులు ముస్లిం సువర్ణ యుగంగా కీర్తిస్తూ అయిదేళ్ల క్రితం ఎర్తుగ్రుల్ అనే టీవీ సిరీస్ తెరకెక్కించారు. ఆ సిరీస్ కు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో అది చాలా పెద్ద హిట్. దీంతో పాటు ఖలాఫత్ ఉద్యమం హీరో అయిన తుర్క్ లాలా కథగా రూపొందించిన సీరియల్ ని పాకిస్తానీలు తమ ఉద్యమ నాయకుడిగా గౌరవిస్తారు.

ఇరు దేశాల సమస్యలు, సహకారాలు
పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తరువాత భారతదేశంతో కశ్మీర్ ప్రాంతంపై పేచీ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్ తమ భూభాగమంటే కాదు తమది అంటూ రెండు దేశాలు గొడవపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. భారతదేశం ఎన్నో సార్లు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతోందని, బార్డర్ వద్ద ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఎత్తి చూపింది. అయితే కశ్మీర్ అంశంపై పాకస్తాన్ కు మద్దతుగా నిలిచింది టర్కీ. పాకిస్తాన్ కు కశ్మీర్ లాగే టర్కీ దేశానికి సిప్రస్ దేశంలో భూభాగ వివాదం ఉంది. దీంతో పాకిస్తాన్ కూడా టర్కీకి మద్దతు తెలుపుతోంది. అంతేకాదు ఇరు దేశాలు యుద్ధం వచ్చినప్పుడు ఆయుధాలు, సైనిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి. టర్కీ దేశం తయారు చేసే ఆయుధాలు, యుద్ధ నౌకలు పాకిస్తాన్ కొనుగోలు చేస్తోంది. అంతేకాకుండా ఇరు దేశాలు సంయుక్తంగా హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు కూడా తయారు చేస్తున్నాయి. ఇరు దేశాల సంయుక్తంగా మిలిటరీ డ్రిల్ కూడా నిర్వహిస్తున్నాయి.

పాకిస్తాన్, టర్కీ మధ్య వాణిజ్యం
టర్కీ, పాకిస్తాన్ మధ్య వాణిజ్యం ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉంది. త్వరలోనే ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల విలువ 5 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. విద్యుత్, గ్యాస్, రవాణా వంటి రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇస్తామాబాద్- టెహ్రాన్- ఇస్తాన్‌బుల్ రైల్వే ప్రాజెక్టు, పాకిస్తాన్ రెనెవబుల్ ఎనర్జీ రంగంలో టర్కీ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. ఈ ప్రాజెక్టులు, పెట్టుబడులు రెండు దేశాల మధ్య పెరుతున్న ఆర్థిక బంధానికి ప్రతీక.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×