Sri City Blast: తిరుపతి జిల్లా శ్రీసిటీ లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వర్కర్లు తీవ్రంగా గాయపడ్డారు. నైట్ షిఫ్ట్ కార్మికులు విధుల్లో ఉండగా ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో దాదాపు 30 మంది కార్మికులు పనిచేస్తుండగా.. పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు ప్రమాదం సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు హుటాహుటీన పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను రక్షించి హుటాహుటీనా ఆస్పత్రికి తరలించాయి. పేలుడు తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మృతిచెందిన నలుగురిలో ఇద్దరిని గుర్తించారు. సత్యవేడు మండలం చెరివి గ్రామానికి చెందిన చిన్న మస్తాన్ (45), తమిళనాడులోని మాదరపాకానికి చెందిన రమేశ్ (45)గా అధికారులు పేర్కొన్నారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
Tirupati District: A major explosion was reported at the Till Healthcare facility in Sri City SEZ, Satyavedu Mandal, around 8 AM. Several workers from the night shift are feared to have been caught in the blast. Reports suggest casualties, but the exact number is yet to be… pic.twitter.com/oxKYQbVl7W
— Chandu_Akkanapalli (@Chandu_report) October 3, 2026
మరోవైపు శ్రీసిటీలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌పై నిషేధం.. ఎందుకంటే?
మరోవైపు ఐటీ మంత్రి నారా లోకేశ్ సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
Also Read: రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!