Saim Ayub Baby Celebration Over Vaibhav: ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో ( Asian Games 2026) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు మధ్య గోల్డ్ మెడల్ కోసం ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ రెండు సిక్సర్లు కొట్టి, ఊపు మీద కనిపించాడు. కానీ అంతలోనే పొంగిపోయిన వైభవ్, రివర్స్ స్వీప్ ఆడి…సైమ్ అయూబ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇక 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఔట్ కాగానే…రెచ్చగొట్టే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు సైమ్ అయూబ్. నువ్వు పిల్ల బచ్చాగాడివిరా అంటూ సిగ్నల్స్ ఇస్తూ, జోల పాడినట్టుగా (Saim Ayub Baby Celebration Over Vaibhav) సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ తరుణంలోనే ఓపెనర్ గా దిగిన వైభవ్ సూర్యవంశీ 9 బంతుల్లో 15 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. మంచి టచ్ లోకి వచ్చిన వైభవ్ ను ఔట్ చేసేందుకు సైమ్ అయూబ్ ను రంగంలోకి దించారు. పాకిస్తాన్ ప్లాన్ ప్రకారమే, వైభవ్ వికెట్ తీశాడు సైమ్ అయూబ్. ఈ సందర్భంగా జోల పాట పాడుతున్నట్టుగా సిగ్నల్స్ ఇస్తూ, సైమ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నువ్వు పిల్ల బచ్చా గాడివి…ఇంటికి వెళ్లి ఆడుకో అంటూ అవమానించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, దీనిపై పాకిస్తాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూంటే, ఇండియన్స్ అభిమానులు మాత్రం ఆగ్రహిస్తున్నారు.
పాకిస్తాన్ తో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి, పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇందులో 7 సిక్సర్లు, 3 బౌండరీలు ఉన్నాయి. ఈ తరుణంలోనే ఈ ఏడాది టీ20 లలో 100 సిక్సర్ల మైలురాయిని ఫినిష్ చేసుకున్నాడు అభిషేక్ శర్మ. కిందటి ఏడాది 108 సిక్సర్లు బాదాడు. అయితే, ఈ సంవత్సరం పాత రికార్డును బ్రేక్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వైభవ్ విఫలమై, 15 పరుగులే చేయగా సంజు శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. 4 బంతులలో 2 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ శర్మ 61 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 20 పరుగులతో మెరుపులు మెరిపించాడు. శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నారు.
SAIM AYUB STRIKES FOR PAKISTAN! 🥶
– Vaibhav Sooryavanshi the flat track bully dismissed for 15 runs against Pakistan.
India – 28/1. pic.twitter.com/xHhuGLRI7r
— Rayham. (@RayhamUnplugged) October 3, 2026