E-Paper
Advertisement

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!
Advertisement

CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ ఉప ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మధురాంతకంలో రోడ్‌షో నిర్వహిస్తున్న సమయంలో ఓ కార్యకర్త విజయ్ చేతికి ఆయన కుమారుడు జేసన్ సంజయ్ ఫోటో ఉన్న ఫ్రేమ్‌ను అందించారు. ఆ ఫ్రేమ్‌ను అందుకున్న విజయ్.. వెంటనే దాన్ని పైకి చేతితో పైకి చుట్టూ ఉన్న వేలాది మంది మద్దతుదారులకు, అభిమానులకు చూపించారు. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన ‘సిగ్మా’ చిత్రం శుక్రవారం (అక్టోబర్ 2) థియేటర్లలో విడుదలైన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

కుటుంబ సమేతంగా మొదటి షో

ఓవైపు విజయ్ మధురాంతకంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని కమలా సినిమాస్ థియేటర్‌కు చేరుకుని ‘సిగ్మా’ ఫస్ట్ డే ఫస్ట్ షో తిలకించారు. జేసన్ తల్లి సంగీత స్వర్ణలింగం ఎంతో ఆనందంతో థియేటర్ కు వచ్చిన దృశ్యాలు సైతం వైరల్ అయ్యాయి. మరోవైపు జేసన్ సోదరి దివ్య సాషా సైతం తన అన్న సినిమా పేరు (సిగ్మా) పేరు ఉన్న టీ-షర్టు ధరించి థియేటర్ లో సందడి చేశారు. అటు జేసన్ సైతం తన ఫ్యామిలితో కలిసి తను డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ను వీక్షించారు.

తండ్రి గురించి జేసన్ ఏమన్నారంటే?

Advertisement

సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జేసన్ సంజయ్ తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘మా నాన్న సాధారణంగా చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడానికి కనీసం 10 సెకన్ల సమయం తీసుకుంటారు’ అని ఆయన గుర్తుచేసుకున్నారు. సినిమా చూసిన తర్వాత కూడా దానిపై స్పందించడానికి ఆయనకు కాస్త సమయం పడుతుందని, విశ్లేషించుకున్నాకే తన అభిప్రాయాన్ని చెప్తారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయనకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని తన పనిని చూసి గర్వపడతారని జేసన్ ధీమా వ్యక్తం చేశారు. తాను దర్శకత్వం వైపు రావాలని నిర్ణయించుకున్నప్పుడు అందరికంటే ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తన తండ్రియేనని జేసన్ తెలిపారు.

సిగ్మా ప్రమోషన్స్‌కు దూరంగా విజయ్

తన తండ్రి అగ్ర నటుడు, ముఖ్యమంత్రి అయినప్పటికీ ‘సిగ్మా’ ప్రచార కార్యక్రమాలకు విజయ్ ను జేసన్ దూరంగా ఉంచడం విశేషం. అయితే ఇది తన సొంత నిర్ణయమని జేసన్ ఒక విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘నా తండ్రి నా సినిమా ప్రచారం చేయరు. ప్రచారం అంతా సినిమా చుట్టూనే తిరగాలి కానీ ఆయన ఇమేజ్ దీనిపై పడకూడదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. పైగా విజయ్ ఇప్పటివరకు పూర్తి సినిమాను చూడలేదని కేవలం కథాంశాన్ని మాత్రమే కుటుంబ సభ్యులకు చెప్పానని జేసన్ తెలిపారు. బిగ్ స్క్రీన్ మీద సినిమాను సరికొత్తగా చూపించాలన్న ఉద్దేశంతోనే వారిని థియేటర్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

Advertisement

Also Read: టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌‌పై నిషేధం.. ఎందుకంటే?

తొలి రోజు ‘సిగ్మా’ బాక్సాఫీస్ వసూళ్లు

ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే ‘సిగ్మా’ చిత్రం మొదటి రోజు మోస్తరు వసూళ్లను సాధించింది. ట్రేడ్ ట్రాకర్ సాక్ నిక్ (Sacnilk) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,813 షోల ద్వారా ఈ చిత్రం తొలిరోజు రూ.2.35 కోట్ల నెట్ (₹2.70 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘భత్తా’, ఫహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలు మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతో ‘సిగ్మా’కు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురవుతోంది.

Also Read: జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

Tags

Related News

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

ఢిల్లీ దద్దరిల్లింది.. ముంబై హోరెత్తింది.. సర్‌ వివాదంలో జెన్ జీ 2.O అటాక్!

నైట్‌క్లబ్‌లో దారుణం.. మహిళ దుస్తులు ఊడదీసి విచక్షణారహిత దాడి.. వీడియోలు వైరల్!

‘విమానమే నా బిడ్డ ప్రపంచం.. భార్య కూడా అదే’.. కెప్టెన్ స్మిత్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

షాకింగ్ ఘటన.. గస్తీ కాస్తున్న మహిళా పోలీసుపై యువకుడి దాడి.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×