E-Paper
Advertisement

టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌‌పై నిషేధం.. ఎందుకంటే?

టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌‌పై నిషేధం.. ఎందుకంటే?
Advertisement

Tirumala Bike Taxi Ban: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల కొండపైకి ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే బైక్ టాక్సీలకు ప్రవేశం లేదని స్పష్టం చేసింది. కాబట్టి కొండపైకి వెళ్లాలని భావించే భక్తులు.. ఎట్టిపరిస్థితుల్లో యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకోవద్దని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

అలిపిరి వద్దే చెక్.. ప్రత్యేక నిఘా

ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు టీటీడీ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ప్రైవేట్ యాప్ ద్వారా నడిచే ద్విచక్ర వాహనాలు కొండపైకి రాకుండా అలిపిరి వద్దే అడ్డుకోవాలని వీటిపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచాలని భద్రతా సిబ్బందికి టీటీడీ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొండపైకి ప్రధాన ప్రవేశ ద్వారమైన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ‘నాట్ అలౌడ్’ (అనుమతి లేదు) పేరుతో ప్రత్యేక పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

యాప్‌లలో ‘తిరుమల’ ఆప్షన్‌కు మంగళం

Advertisement

కేవలం తనిఖీ కేంద్రాల వద్దే కాకుండా సాంకేతికంగా కూడా ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ సర్వీసులకు చెక్ పెట్టాలని టీటీడీ సన్నాహాలు చేస్తోంది. సదరు సంస్థల యాప్‌లలో ‘తిరుమల’ లేదా అక్కడ ఉన్న హోటళ్లకు రైడ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపించకుండా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సంబంధిత రైడ్ షేరింగ్ కంపెనీల యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటూ ఆయా యాప్‌లలో తిరుమల లొకేషన్ డ్రాప్/పికప్ ఆప్షన్లను నిలిపివేయాలని కోరనుంది.

మరి సొంత బైక్స్ సంగతేంటి?

అయితే భక్తులు, స్థానికులు వినియోగించే వ్యక్తిగత (సొంత) ద్విచక్ర వాహనాలకు మాత్రం యాథావిధిగా కొండపైకి అనుమతి ఉంటుందని టీటీడీ వర్గాలు స్పష్టం చేశాయి. వ్యాపార రీత్యా నడిపే బైక్ టాక్సీలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నాయి. కాబట్టి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పును గమనించి, ప్రైవేట్ బైక్ టాక్సీ బుకింగ్‌లపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

Advertisement

Also Read: వివాదంలో ఎంకే స్టాలిన్.. మహిళా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ టీవీకే!

నిర్ణయం వెనుక నేపథ్యం!

అయితే టీటీడీ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ఇటీవల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదమే కారణమని అభిప్రాయాలు ఉన్నాయి. గత 26న హైదరాబాద్ కు చెందిన సునీల్ అనే భక్తులు.. కొండపై నుంచి తిరుపతి ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో బైక్ వెళ్తుండగా ఘాట్ రోడ్డులోని 26వ మలుపు వద్ద వారి వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. వేగంగా వెళ్లి ఘాట్ రోడ్డు క్యాష్ బారియర్ ను ఢీ కొట్టడంతో బైక్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సునీల్ తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందారు. టీటీడీ తాజా నిర్ణయానికి ఆ ఘటనకు సంబంధం ఉన్నట్లు సమాచారం.

Also Read: జంతర్ మంతర్ 2.0.. అక్టోబర్ 10న చలో ఢిల్లీ.. సీఈసీకి బొద్దింకల పార్టీ అల్టిమేటం!

Tags

Related News

చీనాబ్ వంతెనపై 100 కి.మీ వేగంతో వందే భారత్ పరుగులు.. వీడియో చూశారా?

బెంగళూరు నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?

నేషనల్ గార్డ్‌ లో చిన్న కమాండో.. యూనిఫాం, తలకు హెల్మెట్ తో భలే ఉందిగా!

జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!

ఇసుకను జల్లెడ పడితే బంగారం దొరుకుతుందట.. మునేరులో వింత వేట!

మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

పెట్రోల్‌ రూల్స్‌ లో బిగ్‌ చేంజ్‌.. లైసెన్సు లేకుండా బిజినెస్ చేస్తే ఇక అంతే సంగతులు!

Big Stories

Advertisement
×