BigTV English
Advertisement

Sri Reddy On YCP: నన్ను దూరం పెట్టారు.. జగన్‌పై శ్రీరెడ్డి రుసరుస

Sri Reddy On YCP: నన్ను దూరం పెట్టారు.. జగన్‌పై శ్రీరెడ్డి రుసరుస

Sri Reddy On YCP: వైసీపీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేడర్‌ను దూరంగా పెట్టిందా? ఇప్పుడు కొత్తవారికి ఛాన్స్ ఇస్తోందా? దీంతో హార్డ్ కోర్ కార్యకర్తలకు మింగుడు పడలేదా? వైసీపీ హైకమాండ్‌పై శ్రీరెడ్డి ఎందుకు గరంగరం అవుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


శ్రీరెడ్డి అంటే వైసీపీ.. ఫ్యాన్ పార్టీ శ్రీరెడ్డి. సింపుల్‌గా చెప్పాలంటే ఆ పార్టీకి హార్డ్ కోర్ అభిమాని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడేది. ఆమె మాటలను పార్టీ నేతలు సైతం ఎంజాయ్ చేసేశారు.

మనకు ఇలాంటి మాస్ వ్యక్తులుంటే బెటరని నేతలు సైతం అనుకునేవారు. అలాగని పార్టీలో ఆమెకి ఎలాంటి పదవులు ఇచ్చిన సందర్భం లేదు. వైసీపీ అధికారం పోయిన తర్వాత శ్రీరెడ్డి హంగామా కంటిన్యూ అయ్యింది.


ఈసారి శ్రీరెడ్డి ఆగ్రహమంతా సొంత పార్టీపై. అదెలా అనుకుంటున్నారు. రీసెంట్‌గా వైసీపీ మీడియా ప్రతినిధిగా యాంకర్ శ్యామలను రంగంలోకి దిగింది. దాంతో శ్రీరెడ్డికి ఎక్కడలేని కోపం తన్నుకుంటూ వచ్చింది. ఓపెన్‌గా ఆ పార్టీని చెడామడా చెడుగుడు ఆడేస్తోంది.

ALSO READ:  ఆడ బిడ్డల రక్షణ, జీరో క్రైమ్ మా టార్గెట్, పోలీసు అమరవీరులకు సీఎం చంద్రబాబు నివాళి

వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై ఎదురుదాడి తాము చేశామని అంటోంది శ్రీరెడ్డి. సీనియర్లను, కష్టపడేవారికి బీజేపీ గుర్తిస్తుందని, టీడీపీ కూడా ఈ విషయంలో కొంత పర్వాలేదని చెప్పింది. ఈ విషయంలో తనను యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ట్రోల్ చేసుకోవచ్చని, తాను పట్టించుకోననని తెలిపింది.

వైసీపీకి ఏళ్ల తరబడి తన వంతు సహాయ సహకారాలు అందించానని, కానీ.. ఎలాంటి గుర్తింపు రాలేదన్నది శ్రీరెడ్డి ఆవేదన. పార్టీలో తాము కష్టపడడం ఎందుకన్నది ఆమె మాట. ఎవరెవరో వచ్చి పార్టీలో కూర్చొంటే బాధ ఉండదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది. వైసీపీ అంటే అభిమానమని అందుకే వచ్చిన వారిని ఏమీ అనలేకపోతున్నామని మనసులోని ఆవేదనను బయటపెట్టింది.

కేవలం శ్రీరెడ్డి మాత్రమే కాదు.. ఎన్నారై కార్యకర్తలు సైతం వైసీపీ వ్యవహారశైలిని దుయ్యబడుతున్నారు. జగన్ కావాల్సింది కేవలం ఓట్లు మాత్రమేనని, దాని కోసమే మీడియా ముందుకొస్తున్నట్లు చెబుతు న్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఎంతో మంది కార్యకర్తలు ఆ పార్టీకి దూరమయ్యారో అక్కసారి ఆలోచించాలని వైసీపీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు హార్డ్‌కోర్ కార్యకర్తలు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×