
Srikalahasti CI : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. చేపట్టారు. శ్రీకాళహస్తిలోని పెళ్లిమండపం వద్ద సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని సీఐ అంజు యాదవ్ అడ్డుకున్నారు. అలాంటి చర్యలను అంగీకరంచబోమని హెచ్చరించారు.
సీఐ అంజుయాదవ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనానికి జనసేన కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గృహనిర్భందం నుంచి తప్పించుకని కొందరు జనసేన నేతలు శ్రీకాళహస్తిలోని కూడలి వద్దకు చేరుకున్నారు.
ఈ సమయంలో ఓ జనసేన నేతపై సీఐ అంజుయాదవ్ చేయిచేసుకున్నారు. రెండు చెంపలపైనా ఎడపెడా కొట్టారు. సీఐ దురుసు ప్రవర్తించారని జనసేన కార్యకర్తలు ఆంందోళన చేపట్టారు. సీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ అంజుయాదవ్ ప్రవర్తనపై ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. గతంలో ఓ టీడీపీ కార్యకర్తపైనా ఇలాగే చేయిచేసుకున్నారు.