Ritu Chowdary : ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన నటి రీతూ చౌదరి (Ritu Chowdary). సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. అయితే ఈ బ్యూటీ తాజాగా ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కాంలో అడ్డంగా బుక్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చిందనే వార్త సంచలనంగా మారింది. తాజాగా తనపై వస్తున్న ఆరోపణలపై రీతూ బిగ్ టీవీతో ఎక్సక్లూజివ్ గా మాట్లాడింది.
విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ లో ఆమె ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ స్కాంలో పెద్ద తలకాయలు ఉన్నట్టుగా టాక్ నడుస్తోంది. మాజీ సీఎం వైయస్ జగన్ సోదరుడు వైయస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇక ఇందులో రీతూ, చౌదరి చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ కు ఆమె రెండవ భార్య.
విషయం ఏంటంటే… సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని, ఆ టైంలో ఏకంగా 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదు కాగా, ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో రీతూ చౌదరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అంటున్నారు. రీతూ చౌదరి (Ritu Chowdary) అసలు పేరు వనం దివ్య. తాజాగా దీనికి సంబంధించి బయటకు వచ్చిన డాక్యుమెంట్స్ లో ఆమె పేరు ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయంపై రీతు చౌదరి (Ritu Chowdary) ఎక్స్ క్లూజివ్ గా బిగ్ న్యూస్ తో మాట్లాడింది. “మీ పేరు మీద వందల కోట్ల విలువైన ఆస్తుల్ని రాయించారని, మిమ్మల్ని బినామీగా ఉంచి, మీ పేరు మీద రిజిస్టర్ చేయించారని సబ్ రిజిస్ట్రార్ సింగ్ ఆరోపించారు. అది నిజమేనా?” అని ప్రశ్నించగా… రీతూ చౌదరి స్పందిస్తూ… “నా పేరు మీద కోట్ల ఆస్తి ఉందంటూ ఏదో చెప్తున్నారు. నాకు అసలు ఏ సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు” అని చెప్పింది.
“సింగ్ వ్యక్తి ఓ డాక్యుమెంట్ ని రిలీజ్ చేశాడు కదా?” అని అడగ్గా… “నాకు అసలు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు. నా గొడవ కోర్టులో ఉంది. రెండు మూడు రోజుల నుంచి ఏదేదో అంటున్నారు. కానీ వన్ ఇయర్ ముందు నుంచే నాకు, అతనికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టులో చెప్పాను. నాకొద్దు ఇతను అని ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడేమో తీసుకొచ్చి ఇతని భార్య అని చెప్తున్నారు. నా లైఫ్ స్టైల్ నేను బతుకుతున్నాను. ఎలాంటి సంబంధం లేని దాంట్లో ఇరికిస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ గురించి నాకు అసలు ఎలాంటి ఐడియా లేదు. అంతకు ముందు నేను ఎలాంటి ల్యాండ్లు, ఫ్లాట్లు కొనలేదు. ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టాను తప్ప, అన్ని కోట్లు ఎన్ని కోట్లు… దీని గురించి ఏమీ తెలియదు” అని చెప్తూనే తన పేరు వనం దివ్య అని ఉంటే తర్వాత రీతూ చౌదరి (Ritu Chowdary)గా మార్చుకున్నాను అని క్లారిటీ ఇచ్చింది.