Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అసలు అర్ధం కావడం లేదు. అభిమానులు.. తమ అభిమాన హీరోలను చూడడానికి వెళ్లి మృత్యువాత పడుతున్నారు. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా ఇప్పుడు టాలీవుడ్ లో అభిమానులు మృత్యువాత పడుతున్నారు. మొన్నటికి మొన్న పుష్ప 2 బెన్ ఫిట్ షోలో రేవతి అనే మహిళ తొక్కిసలాటలో మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక ఈ కేసు అల్లు అర్జున్ మెడకు బిగుసుకుంది. ఇప్పటివరకు ఆ కేసు నుంచి బయటపడలేదు. కోర్టులు, కేసులు అంటూ పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.
ఇక ఈ ఘటన ఇంకా మరువకముందే మరో ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రెండు రోజుల క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరంలో జరిగిన విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈవెంట్ అంతా బాగా జరిగింది. పవన్ సైతం చివర్లో అభిమానులను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని, అభిమానులకు ఏదైనా జరిగితే తన గుండెకు గాయం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక వచ్చిన ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలను చూసుకొని ఇంటికి బయల్దేరారు.
Shraddha Das: పచ్చ చీరలో పరువాలు ఒలకబోస్తున్న శ్రద్ధా దాస్
అయితే చావు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్న కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ ను అతివేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో మరోమారు ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఇక ఆ ఇద్దరు యువకుల మృతి గురించి వెంటనే తెలుసుకున్న మేకర్స్.. వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇద్దరు యువకుల మృతిపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయినా ఎవరు పట్టించుకోలేదని, ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం అని ఆయన తెలుపుతూ.. ఇద్దరు యువకుల కుటుంబాలకు చెరో రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని అందించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపారు. ఇకనుంచి తాను అదే రోడ్డుపై ప్రయాణించనున్నట్లు చెప్పుకొచ్చారు.
Game Changer Pre Release Event: విధ్వంసం సృష్టించిన ఆకతాయిలు.. ఆరుగురు అరెస్ట్..!
” కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు.
గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. అయిదు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. రెండు నగరాల మధ్య ప్రయాణాలకు కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్లు మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు.
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఇష్యూ… అవును అంటూ క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండుసార్లు చెప్పడమైంది.. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను” అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం
కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…
— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025