BigTV English

Pushpa 2 : ఓటీటీలోకి పుష్ప రాజ్ ఎంట్రీ… వాళ్ళకు మాత్రమే ఈ గుడ్ న్యూస్

Pushpa 2 : ఓటీటీలోకి పుష్ప రాజ్ ఎంట్రీ… వాళ్ళకు మాత్రమే ఈ గుడ్ న్యూస్

Pushpa 2 : గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి, బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2 ). అల్లు అర్జున్ (Allu Arjun) కు కెరీర్ లోనే మర్చిపోలేని హిట్ ఇచ్చిన ఈ మూవీ, మర్చిపోలేని వివాదాన్ని కూడా తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ సంబంధించిన రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. అయితే ఈ గుడ్ న్యూస్ మాత్రం అందరికీ కాదు.


క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప 2’ (Pushpa 2 ). ఈ కమర్షియల్ భారీ బడ్జెట్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించారు. డిసెంబర్ 5న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా  1800 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ, ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ‘పుష్ప 2’ థియేట్రికల్ రిలీజ్ తర్వాత, అంటే థియేటర్లలోకి వచ్చి 56 రోజులు పూర్తయ్యాకనే ఈ సినిమా అందుబాటులోకి వస్తుందని చిత్రం బృందం అనౌన్స్ చేసింది. దాని ప్రకారం చూసుకుంటే ఈ లెక్క సరిగ్గా సరిపోతుంది. కానీ ఈ విషయంపై మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.


అలాగే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ (Pushpa 2 ) జనవరి 30న కేవలం హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ కాబోతోంది. మరి నిజంగానే ఈ మూవీ జనవరి 30న స్ట్రిమింగ్ కాబోతోందా? మిగతా భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుంది? అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. రిలీజైన 30 రోజుల్లోనే ఈ సినిమా 1800 కోట్లను వసూలు చేసిన ఘనతను సొంతం చేసుకుంది. మరోవైపు నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని దాదాపు 250 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాక్.

ఇదిలా ఉండగా… మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ వివాదంలో ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటిదాకా ఆయన ఆ సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను ఇంకా కలవలేదు. కానీ చిత్ర బృందం అంతా కలిపి దాదాపు 2 కోట్ల రూపాయలని ఆర్థిక సాయంగా ప్రకటించారు. ఇక తాజాగా అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ దొరకగా, మరోవైపు బన్నీకి శ్రీతేజ్ ని పరామర్శించడానికి షరతులతో కూడిన పర్మిషన్ లభించింది.

Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×