Student Died due to electric shock in Kadapa: ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. సైకిల్ పై బడికి వెళ్తుండగా విద్యుత్ వైర్లు తెగి మీదపడడంతో విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. కడప నగరంలో ఉన్న అగాడి వీధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నది. బుధవారం ఇద్దరు విద్యార్థులు సైకిల్ పై స్కూల్ కు వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగ మీద పడ్డాయి. దీంతో ఆ విద్యార్థులు ఒక్కసారిగా కిందపడిపోయారు. అక్కడే వారి శరీరంపై మంటలు కూడా చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే అక్కడికి చేరుకుని, ఆ విద్యుత్ తీగలను తొలగించారు.
Also Read: SSC కెమికల్ ఫ్యాక్టరీలో.. భారీ అగ్ని ప్రమాదం
అయితే, ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని, మృతిచెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు.
Also Read: జగన్ గారూ.. మహిళల కోసం మీరు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది: అనిత
ఈ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేశ్.. విద్యార్థి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలుడి మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడిన మరో బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.