Kommineni: ఏపీ రాజధాని అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అంతేకాదు కొన్ని షరతులను విధించింది. అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించింది.
కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం ఉదయం ఆ పిటిషన్‌పై ఇద్దరు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ పోలీసుల తరపు న్యాయవాది-కొమ్మినేది తరపు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు.
నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని కొమ్మినేని తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అరెస్టు విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు తీర్పును పాటించలేదని గుర్తు చేశారు. కేఎస్సార్ లైవ్ షో లో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఎలా బాధ్యత వహిస్తారు? దీన్ని ఏపీ పోలీసు తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు.
టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అంటూ ధర్మాసనం ప్రస్తావించింది. కేసుల విచారణ సందర్భంగా తాము నవ్వుతామని గుర్తు చేశారు న్యాయమూర్తి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కొమ్మినేనిని విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్ కోర్టు విధిస్తుందని తెలిపింది.
ALSO READ: విశాఖలో ఆ ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించిన పోలీసులు
మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులో వాదనలు పరిశీలిస్తే కృష్ణంరాజు ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో ఆయనను ఏ-1గా పోలీసులు ప్రస్తావించారు.
గురువారం విచారణకు సందర్భంగా ఆయనకు మంగళగిరి కోర్టు ఈనెల 26వరకు రిమాండ్ విధించింది. కొమ్మినేని మాదిరిగా బెయిల్ కోసం ఈయన సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయనకు సపోర్టు ఇచ్చేందుకు వైసీపీ లీగల్ సెల్ ముందుకొచ్చినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సో.. మరోవారంలో కృష్ణంరాజు బయటకురావడం ఖాయమన్నది వైసీపీ నేతల మాట.