BigTV English

Worlds Best pilots: ప్రపంచంలో ఉత్తమ పైలెట్లు ఉన్న దేశం ఏది? మన దేశం ర్యాంక్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Worlds Best pilots: ప్రపంచంలో ఉత్తమ పైలెట్లు ఉన్న దేశం ఏది? మన దేశం ర్యాంక్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం మన దేశంలో ఒక చీకటి రోజును మిగుల్చింది. టేకాఫ్ అయిన కేవలం రెండు నిమిషాల్లోనే బూడిద కుప్పగా మారిపోయింది విమానం. ఆ ప్రమాదంలో దాదాపు 242 మందికి పైగా మరణించారు. దీంతో దేశం శోక వాతావరణంలో మిగిలిపోయింది. పైలెట్లు ప్రయాణికులను కాపాడడానికి తమ వంతు ప్రయత్నాన్ని చేస్తారు. కానీ ఆ సమయం కూడా వారికి దక్కలేదు. కేవలం రెండు నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.


ఈ విమాన ప్రమాదం తర్వాత పైలెట్ ఉద్యోగాలు, పైలెట్ శిక్షణ గురించి తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రపంచంలో అత్యుత్తమ పైలెట్లను కలిగి ఉన్న దేశం ఏది? పైలెట్ల శిక్షణ విషయంలో మన దేశం ఎన్నో ర్యాంకులో ఉంది వంటి అంశాలకు సమాధానాలు తెలుసుకుందాం.

ఏ దేశ పైలెట్లు ఉత్తమం
ప్రపంచంలోని అత్యుత్తమ పైలెట్లు ఆస్ట్రేలియాకు చెందిన వారిగా చెప్పుకుంటారు. ఆస్ట్రేలియా తర్వాత కెనడా తర్వాత స్థానంలో నిలిచింది. ఇక అమెరికా మూడవ స్థానంలో ఉంది. అమెరికా తర్వాత న్యూజిలాండ్ నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది. ఈ నాలుగు దేశాలు పైలెట్ శిక్షణను ఉత్తమంగా ఇస్తాయని చెప్పుకుంటారు. ఇక్కడ పైలెట్ల పని సంస్కృతి కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తారు.


ఈ ఏజెన్సీ ద్వారా అంచనా
ప్రపంచవ్యాప్తంగా పైలెట్ ఉద్యోగాలు చేస్తున్న వారి నాణ్యతను, సామర్థ్యాన్ని నిర్ణయించడానికి ఒక ఏజెన్సీ పనిచేస్తుంది. ఆ ఏజెన్సీ పేరు ICAO. దీన్ని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థగా పిలుచుకుంటారు. ఈ సంస్థ భారత పైలెట్ల నాణ్యత సమర్ధత గురించి వివరించింది.

భారత్ స్థానం ఎంత?
ఈ నివేదిక ప్రకారం ఉత్తమ పైలెట్లను అందించే దేశాల జాబితాలో మన దేశం 48వ స్థానంలో ఉంది. భారతీయ పైలెట్ల వారి సామర్థ్యం ఆధారంగా వందకు 85 మార్కులు మాత్రమే ఇచ్చారు. 2018లో ఈ స్కోరు 69గా ఉండేది. కానీ మన దేశంలో విమానయాన రంగం పురోగతి సాధించడంతో పైలెట్ల సామర్థ్యం, శిక్షణ కూడా మెరుగుపడ్డాయి.

ఉత్తమ పైలెట్ శిక్షణా సంస్థలు ఇవిగో
మనదేశంలో ఉత్తమ పైలట్ శిక్షణా సంస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఫుర్సత్‌గంజ్ ఎయిర్ ఫీల్డ్‌లో ఉంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పైలెట్ శిక్షణ సంస్థలలో ఇది కూడా ఒకటి. దీనిలో సీటు సంపాదించాలంటే ముందుగా రాత పరీక్ష ఉంటుంది. తర్వాత పైలెట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ రెండింటి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూలో కూడా నెగ్గితేనే ఈ అకాడమీలోకి ఎంట్రీ ఉంటుంది దీనిలో పైలెట్ లైసెన్స్ అందించడంతోపాటు అనేక రకాల శిక్షణలు అందిస్తారు.

నేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2007లో స్థాపించారు. ఇది ఆక్స్ ఫర్డ్ ఏవియేషన్ అకాడమీ స్థాపించిన విమాన ఇన్స్టిట్యూట్ లో ఒకటి. మహారాష్ట్రలోని గొండియాలో ఇది ఉంది. దీన్ని ఆక్స్‌ఫర్డ్ ఏవియేషన్ అకాడమీ గొండియా అని కూడా పిలుస్తారు. దీనిలో 19 నెలల పాటు పైలట్ శిక్షణ కార్యక్రమాలు ఇస్తారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన సూచనలు మేరకు ఇక్కడ కోర్సులు ఉంటాయి.

అలాగే మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్, అహ్మదాబాద్ ఏవియేషన్ అండ్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బాంబే ఫ్లయింగ్ క్లబ్ వంటివి కూడా పైలెట్ కోర్సులను అందిస్తాయి. ఇందులో కోర్సులు పూర్తి చేసిన వారు కమర్షియల్ పైలెట్లు గా మారుతారు.

Related News

Masala Vada: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి

Brain Health:ఈ టిప్స్ పాటిస్తే చాలు.. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది

High Cholesterol: గుండె జబ్బులు రాకూడదంటే ? నిపుణుల సూచనలివే !

Warning Signs of Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి ?

Signs of Kidney Damage: ఉదయం పూట ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా ? మీ కిడ్నీలు పాడైనట్లే !

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Copper Bottle: కాపర్ బాటిల్ వాటర్ తాగారో అంతే సంగతులు, వీళ్లకు మరీ డేంజర్!

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

Big Stories

×