BigTV English

Chandrababu Supreme Court : సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఊరట.. బెయిల్ విచారణ వాయిదా!

Chandrababu Supreme Court : సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిఐడీ దాఖలు చేసిన పటీషన్‌పై అత్యున్నత కోర్టు విచారణ వాయిదా వేసింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏ అంశంపై తీర్పు వెలువడిన తరువాతనే బెయిల్ రద్దు విచారణ జరుగుతుందని సుప్రీం ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. అలాగే బెయిల్ రద్దు తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.

Chandrababu Supreme Court : సుప్రీం కోర్టులో చంద్రబాబుకు ఊరట.. బెయిల్ విచారణ వాయిదా!
Supreme court on chandrababu bail

Supreme court on chandrababu bail(AP breaking news today) :

సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిఐడీ దాఖలు చేసిన పటీషన్‌పై అత్యున్నత కోర్టు విచారణ వాయిదా వేసింది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏ అంశంపై తీర్పు వెలువడిన తరువాతనే బెయిల్ రద్దు విచారణ జరుగుతుందని సుప్రీం ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. అలాగే బెయిల్ రద్దు తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది.


రాజకీయ ర్యాలీలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలని కూడా సీఐడీ ఈ పిటీషన్‌లో ప్రస్తావించింది. కానీ ఆ అభ్యర్ధనను సుప్రీం తోసిపుచ్చింది. చంద్రబాబు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చునని.. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీం కోర్టు షరతులు విధించింది. అలాగే ప్రభుత్వం లేదా సిఐడీ తరపున కూడా స్కిల్ కేసు గురించి బహిరంగం వ్యాఖ్యానాలు చేయరాదని చెప్పింది.

ఏపీ హైకోర్టు నవంబర్ 20న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన సాధారణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి, ఆ పథకం కోసం కేటాయించిన నిధులను టిడీపీ ఖాతాలకు మళ్లించారనే వాదించిన సీఐడీ.. ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదంటూ ఏపీ హైకోర్టు పూర్తిస్థాయి చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చింది. కానీ ఏపీ సీఐడీ ఈ నెల 21న చంద్రబాబు బెయిల్‌ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.


ఏపీ హైకోర్టు తమ వాదనలను పూర్తిగా వినకుండానే చంద్రబాబుకు సాధారణ బెయిల్ మంజూరు చేసిందని సుప్రీం కోర్టులో సిఐడి వాదించింది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని.. సిఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ పిటీషన్ డిసెంబర్ 8వ తేదీ లోపు దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×