BigTV English

Hi Nanna : హాయ్ నాన్న నుండి మరో సాంగ్.. శృతి హాసన్‌తో నాని క్రేజీ స్టెప్స్..

Hi Nanna : హాయ్ నాన్న నుండి మరో సాంగ్.. శృతి హాసన్‌తో నాని క్రేజీ స్టెప్స్..
Hi Nanna

Hi Nanna : నాచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న చిత్రం డిసెంబర్ 7వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మీద ఫుల్ గా కాన్సన్ట్రేషన్ చేసిన చిత్ర బృందం ఏదో ఒక క్రేజీ అప్డేట్ తో మూవీ పై బజ్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో మూవీ నుంచి విడుదలైన ఓ మంచి పార్టీ సాంగ్ కిరాక్ స్టెప్స్ తో ఆడియన్స్ ని ఊపేస్తోంది. అయితే ఇందులో నానితో స్టెప్పులు వేసింది మృణాల్ కాదు.. శృతిహాసన్.


మొన్న విడుదల చేసిన ట్రైలర్ లో నాని మొదటి భార్య పాత్ర శృతిహాసన్ పోషిస్తుంది అన్న విషయం అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అన్ని సాంగ్స్ ఫాదర్..డాటర్ సెంటిమెంట్ లేకపోతే నాని.. మృణాల్ మధ్య రొమాన్స్ తో ఉన్నాయి. కాగా ఇప్పుడు విడుదలైన లేటెస్ట్ పబ్ సాంగ్ ..నాని, శృతి మధ్య మంచి రొమాన్స్ తో సాగుతోంది.

‘‘ఒడియమ్మ’’.. అంటూ నాని వేసే స్టైలిష్ స్టెప్పులకు ,శృతి గ్లామర్ చూపర్లకు మంచి ట్రీట్ గా ఉంది. హాయ్ నాన్న సాంగ్స్ తో ఇప్పటివరకు మనల్ని బాగా అలరించిన హేషామ్ అబ్దుల్.. ఈ పార్టీ సాంగ్ తో ఒక్కసారిగా అందరి మైండ్ బ్లాక్ చేశాడు. అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్.. ఈ పాటకు మరింత కిక్కిస్తున్నాయి. జీవితంలోని వేదాంతాన్ని మొత్తం ఓ మందు బాటిల్ లో.. చిన్న పాట రూపంలో శ్రీరామ్ అద్భుతంగా రాశాడు. ప్రస్తుతం ఈ మూవీ నుంచి వచ్చిన ఈ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా ఉంది.


ఎటువంటి సెంటిమెంట్ అయినా ..ఎమోషన్ అయినా తనదైన శైలిలో అద్భుతంగా పలికించే నటుడు నాని .అందుకే అతను నాచురల్ స్టార్ అన్న బిరుదు తెచ్చుకున్నాడు. జెర్సీలో తండ్రి కొడుకు సెంటిమెంట్ తో మనసును పిండేసిన నాని ఇప్పుడు తిరిగి ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ బ్యూటిఫుల్ క్లీన్ అండ్ క్లియర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఈ మూవీ కి ఉన్నాయి అని చెప్పకనే చెబుతోంది.

ఈ మూవీకి సంబంధించిన నాన్ థియరీటికల్ రైట్స్ కూడా మంచి భారీ ధరకే అమ్ముడైనట్లు సమాచారం. మూవీకి సంబంధించిన సాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ మంచి ఫ్యాన్సీ అమౌంట్ కి దక్కించుకుంది. ఇప్పటికే నాని నటించిన శ్యామ్ సింగరాయ, అంటే సుందరానికి ,దసరా మూవీస్ కి సంబంధించిన రైట్స్ సన్ నెట్వర్క్ వద్దే ఉన్నాయి. ఇప్పుడు నాని నటించిన ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ని కూడా సన్ నెట్వర్క్ సుమారు 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×