BigTV English

CM Chandrababu: చెత్త ఎత్తిన చంద్రబాబు, శభాష్ అంటూ నెటిజన్ల ప్రశంసలు

CM Chandrababu: చెత్త ఎత్తిన చంద్రబాబు, శభాష్ అంటూ నెటిజన్ల ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల మూడో శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తాజాగా తణకులో జరిగిన శుభ్రతా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టి స్థానిక పార్క్ లో చెత్తను ఊడ్చారు. బుట్టలోకి ఎత్తి డస్ట్ బిన్ లో వేశారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ

ఆ తర్వాత పారిశుధ్య కార్మికులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వారి సమస్యలను సావధానంగా విని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పారిశుధ్య కార్మకులతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం తణకులో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను సీఎం ప్రారంభించారు. అక్కడ ఉన్న పర్యావరణ అనుకూల ఉత్పత్తులను పరిశీలించారు.


చెత్తతో సంపద సృష్టించాలన్న చంద్రబాబు

చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా సహకరించాలని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.  స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక దగ్గర ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులపై ఆయన ప్రశంసలు కురిపించారు. పారిశుధ్య కార్మికులు సమాజానికి వెన్నెముకగా  అభివర్ణించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్నారు. పరిశుభ్రత అనేది వారి విధి మాత్రమే కాదు,  అందరి బాధ్యత అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు కారణం అవుతాయని చెప్పారు. చేతులు కలిపి అందరూ స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌లో చురుకుగా పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

స్వచ్ఛాంధ్ర కోసం కలిసి పని చేద్దాం..

ఇక స్వర్ణాంధ్ర కోసం ఉద్యమం చేస్తూనే, స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమం చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వేస్ట్ ఎనర్జీ కింద కంపోస్టు తయారుచేయడానికి ఎన్నో పద్దతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. బయో డైవర్సిటీ పేరుతో 10 లక్షలతో మెటీరియల్ పెడితే ఈజీగా  కంపోస్టు తయారు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒకప్పుడు పారిశుధ్య కార్మికులను చులకనగా చూసేవారని.. కానీ, వాళ్లు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని చెప్పారు.  మునిసిపల్ కార్మికులు అందరిని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సమాజం కోసం, స్వర్ణాంధ్ర కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు రావాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ ను ఎవరూ ఉపయోగించకూడదన్నారు. దాని వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు.  ప్రమాదకరమైన ప్లాస్టిక్ తయారు చేసే వారిని నియంత్రించే దిశగా ప్రత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.  అటు మంత్రి నారా లోకేష్ కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. తణకులోని ఇతర ప్రాంతాల్లో ఆయన చెత్తను ఊడ్చి పరిసరాలను శుభ్రం చేశారు.

Read Also: బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి, నెటిజన్లకు సజ్జనార్ పిలుపు!

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×