BigTV English

JioStar – IPL 2025: IPL 2025తో అంబానీ పంట పండటం ఖాయం..10 సెకన్లకు రూ.20 లక్షలా?

JioStar – IPL 2025: IPL 2025తో అంబానీ పంట పండటం ఖాయం..10 సెకన్లకు రూ.20 లక్షలా?

JioStar – IPL 2025: రిలయన్స్.. ఈ పేరే ఓ బ్రాండ్. ఈ ప్రపంచ దిగ్గజ రిలయన్స్ సంస్థ వ్యాపారం చేయని రంగం లేదు. దేశంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తి {JioStar – IPL 2025} ముఖేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. ప్రతి ఇంటికి అవసరమైన అన్ని వస్తువులను ఈ సంస్థ విక్రయిస్తుంది. ఎన్నో రకాల వస్తువులను విక్రయిస్తూ దేశంలోనే నెంబర్ వన్ కంపెనీగా ఎదిగింది రిలయన్స్.


Also Read: IPL Controversies: శ్రీశాంత్ చెంపదెబ్బ నుంచి కోహ్లీ-గంభీర్ వరకు..ఐపీఎల్ పంచాయితీలు ఇవే !​

ఇటీవల ఈ రిలయన్స్ సంస్థ హాట్ స్టార్ నెట్వర్క్ తో కలిసి జియో హాట్ స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాదికి సంబంధించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోతోంది. జియో హాట్ స్టార్ ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేస్తూ కూడా మంచి ఆదాయాన్ని పొందుతోంది. అయితే ఐపీఎల్ 2025లో ఆయా జట్లకు యాడ్ రెవెన్యూ విషయంలో స్పాన్సర్షిప్స్ నుండి వచ్చే ఆదాయం ఎంత..? టీవీ బ్రాడ్ కాస్టింగ్, ఓటిటి రైట్స్ ని దక్కించుకున్న ముకేశ్ అంబానికి చెందిన రిలయన్స్ ఎన్ని వేలకోట్ల ఆదాయాన్ని పొందుతోంది..? అనే వివరాల్లోకి వెళితే..


జియో హాట్ స్టార్ టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని 2023 – 28 వరకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచెస్ట్ క్రీడ అయిన ఐపీఎల్ ద్వారా జియో ఒక్క హాట్స్టార్ లో మాత్రమే ప్రసారం కావడంతో వేల కోట్లు సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రాడ్కాస్టింగ్ వల్ల యాడ్ స్లాట్ బుకింగ్ ధరలు భారీగా పెరిగాయట. గత ఏడాదితో పోలిస్తే 30% పెరిగినట్లు సమాచారం.

దీంతో ఈ ఐపీఎల్ 2025 ద్వారా రిలయన్స్ జియో స్టోర్ రికార్డ్ బ్రేకింగ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ అందుకోనుందని, పలు నివేదికల ప్రకారం టెలివిజన్ లో 10 సెకండ్ల ఆడ్ ధర రూ. 18 – 19 లక్షలు ఉందట. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 మొత్తం ద్వారా అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఏడు కోట్ల వరకు జనరేట్ అవుతుందని అంచనా. అయితే ఇందులో జియో హాట్ స్టార్ కి రూ. 4,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఇక ఐపీఎల్ లో పాల్గొనే పది జట్లు, బీసీసీఐ బోర్డు కూడా ఆడ్ రెవెన్యూ విషయంలో ఈ స్పాన్సర్షిప్ ద్వారా బాగానే అర్జిస్తుంది.

Also Read: Nitish Kumar Reddy: SRH అభిమానులకు గుడ్ న్యూస్… వీరుడు వస్తున్నాడు!

ఒక్క ఐపీఎల్ సీజన్ ద్వారా జట్లు 1300 కోట్లు, బీసీసీఐ 900 కోట్లు సంపాదిస్తాయని అంచనా. అయితే ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ లో మాత్రమే కాకుండా దక్షిణాఫ్రికా, అమెరికా, యూఏఈ లీగ్ లలో కూడా జట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇవి మాత్రమే కాకుండా తాజాగా ఓవల్ ఇన్విన్సిబుల్స్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఫ్రాంచైజీ లీగ్ లో జట్టు ” ది 100″ లో దాదాపు సగం వాటాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇలా చేసిన మొదటి ఐపీఎల్ ఫ్రాంచైజీగా అవతరించింది.

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×