BigTV English

Tadipatri JC Brothers | తాడిపత్రిలో మళ్లీ జేసీ బ్రదర్స్ హవా.. అనంతపురం ఎంపీ టికెట్ టార్గెట్..

Tadipatri JC Brothers | జెసి కుటుంబం. రాజకీయాలలో దీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం.. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు జేసీ బ్రదర్స్. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో బలమైన జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిల పొలిటికల్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 2019 ఎన్నికలలో వారిద్దరు తమ వారసులను ఎన్నికల బరిలోకి దింపి చేతులు కాల్చుకున్నారు. అ

Tadipatri JC Brothers | తాడిపత్రిలో మళ్లీ జేసీ బ్రదర్స్ హవా.. అనంతపురం ఎంపీ టికెట్ టార్గెట్..

Tadipatri JC Brothers | ఆ జిల్లాలో వారు ఏం చేసినా ఆ రాజకీయ నాయకులు వార్తల్లో నిలుస్తారు. సడన్‌గా సైలెంట్ అయినా కూడా ఫోకస్ అవుతుంటారు. అంతటి రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీ వారిది. మామూలుగానే వారు నిత్యం ఎదో ఒక సమస్యపై రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతూ ఉంటారు. ఇక ఎన్నికల సమయంలో అయితే ఆ హడావుడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని రోజులుగా వారు తమకు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను పట్టించుకోకపోవడంతో.. ఇక పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకుంటారేమో అని అందరూ అనుకున్నారు. అయితే వారు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వారు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చి తిరిగివచ్చి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతకీ ఎవరా దిగ్గజాలు?.. వారి యాక్షన్ ప్లాన్ ఏంటి?


జెసి కుటుంబం. రాజకీయాలలో దీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం.. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు జేసీ బ్రదర్స్. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో బలమైన జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిల పొలిటికల్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే 2019 ఎన్నికలలో వారిద్దరు తమ వారసులను ఎన్నికల బరిలోకి దింపి చేతులు కాల్చుకున్నారు. అనూహ్యంగా రాష్ట్రమంతా జగన్ ఫ్యాన్ గాలి గట్టిగా వీయడంతో అటు తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి, ఇటు అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన దివాకరరెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి పరాజయం పాలయ్యారు .

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి తిరిగి ప్రజాసమస్యలపై రోడ్డెక్కుతున్నారు. అయితే మరోపక్క జేసీ పవన్ మాత్రం జిల్లాలో కనిపించడం లేదు. దాంతో రానున్న ఎన్నికల్లో జేసీ వారసుడు అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా నిలబడతారా? లేదా? అన్న చర్చ మొదలైంది. గత రెండు సంవత్సరాలుగా పవన్ క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ఉండడం లేదు. ఆయన ఈ జనవరిలో తిరిగి వచ్చి.. పొలిటికల్‌గా యాక్టివ్ అవుతారని ఆయన అనుచరవర్గం ఎప్పటి నుంచో చెబుతోంది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా పవన్ జిల్లాలో కనిపించలేదు.


ఆ క్రమంలో జేసీ ఫ్యామిలీలో పొలిటికల్ ఈక్వేషన్లు మారు పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. వాస్తవానికి తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రూటే సపరేటు. ఆయన ఏది చేసినా సంచలనమే. ప్రభుత్వంపై తన నిరసన గళాన్ని వినిపించినా, స్థానిక నాయకులపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా తనకంటూ ఓ స్టైల్‌తో ఆయన అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన పంథానే వేరు. అటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల తన కొడుకు అస్మిత్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి డాన్స్ చేశారు. 73 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా స్టెప్పులేస్తూ.. తనలో ఉత్సాహం తగ్గలేదన్న సంకేతాలిచ్చారు .

అలాంటి ప్రభాకరరెడ్డి చాలా కాలంగా తాడిపత్రి వదిలి రాలేదు. ఎక్కువగా తాడిపత్రి కే పరిమితం అయిన జెసి ఎప్పుడైనా అనంత నగరానికి వచ్చినా కేవలం ప్రెస్ మీట్ లేదా జిల్లా అధికారులను కలసి వినతిపత్రాలు ఇచ్చి వెళ్లిపోయేవారు. చాలా రోజుల తర్వాత అనంతపురంలో పర్యటించారు. అనంతలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహనికి పూలమాల వేసి.. జిల్లాలో ఇంత మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క రెడ్డి నాయకుడి విగ్రహం పెట్టుకొలేకపోతున్నాం అంటూ రెడ్డి సెంటిమెంట్‌ని రగిల్చే ప్రయత్నం చేశారు. ఆయన అంత సడన్‌గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమలవేసి నివాళి అర్పించడం.. రెడ్డి నాయకుల విగ్రహాల ఏర్పాటుకు స్ధానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి చొరవ తీసుకోవాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు జిల్లా రెడ్డి నాయకులు ‘రెడ్డి’ అని చెప్పుకోవడానికి భయపడుతున్నారని.. తాను మాత్రం అన్ని కులాల నాయకుడిని అంటూ కలకలం రేపారు.

జెసి ప్రభాకర్ రెడ్డి అలా సడన్‌గా అనంతపురంలో పర్యటించడం.. రెడ్డి సెంటిమెంట్ రగిలించడం.. ఇవన్నీ చూస్తుంటే అనంతపురం ఎంపీ స్థానంపై మళ్లీ దృష్టి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులు ఖరారు కాలేదు. అనంత లోక్‌సభ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై పార్టీ శ్రేణుల్లోనే క్లారిటీ లేదు. వైసీపీ మాత్రం పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణని అనంతపురం ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. టీడీపీ మాత్రం ఇంకా ఒక సమర్థడైన అభ్యర్థి కోసం వెతుక్కుంటోంది.

దీంతో మేమున్నాం అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో జెసి ప్రభాకర్ రెడ్డి అన్న జెసి దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో దివాకర్ కొడుకు పవన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ .. సెగ్మెంట్‌లో ఆ ఫ్యామిలీ హవా కొనసాగుతూనే ఉంది. మరోవైపు తన రాజకీయ వారసత్వాన్ని కొడుకు పవన్‌కు అప్పగించిన దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగారు. అలాగే పవన్‌రెడ్డి సైతం అనంతపురంలో కనిపించడం లేదు. దాంతో అనంతపురంలో టీడీపీ తరపున ఎంపీ అభ్యర్ధిగా జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ అస్మిత్ రెడ్డి పోటీలో ఉంటారన్న టాక్ ఆ వర్గీయుల్లో వినిపిస్తోంది. మరి దానిపై దివాకరరెడ్డి లెక్కలు ఎలా ఉన్నాయో? టీడీపీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×