Talliki Vandanam Scheme 2025: చంద్రబాబు సర్కార్ ఏడాది తర్వాత స్కీమ్‌లపై ఫోకస్ చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కు ఏడాది కావడంతో తల్లికి వందనం పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ కింద తల్లుల అకౌంట్లలో డబ్బు జమ కావాలంటే కొన్ని నిబంధనలు తెలుసుకోవాలి. అందులో ఏ ఒక్కటి తగ్గినా తల్లుల అకౌంట్లో డబ్బులు పడే ఛాన్స్ ఉండదు. అందుకు సంబంధించిన డీటేల్స్‌పై ఓ లుక్కేద్దాం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి గురవారం నాటికి ఏడాది పూర్తి కానుంది. ఏడాది సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే ప్రతి విద్యార్థికీ 15 వేల ఆర్థిక సాయం చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం పిల్లల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది.
మొత్తం 67,27,164 మంది తల్లుల అకౌంట్లలో రూ. 8745 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. మంత్రి లోకేష్ చేసిన ట్వీట్‌పై అప్పుడే అనుమానాలు లేకపోలేదు. 67 లక్షల 27 వేల మంది తల్లుల అకౌంట్లలో 15 వేల చొప్పున జమ చెయ్యాలంటే 10వేల 90 కోట్లు కావాలి. రూ.8,745 కోట్లు రిలీజ్ చేయడమేంటని ప్రశ్నలు లేకపోలేదు. ఇంకా 1345 కోట్ల 74లక్షల 60వేలు తక్కువ.
ప్రభుత్వం ఏ విధంగా లెక్క వేసిందన్నది అసలు ప్రశ్న. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అందరికీ ఈ పథకం కింద డబ్బులు ఇస్తామని తెలిపింది. కేవలం నిధులు మాత్రమేకాదు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఒక్కసారి తెలుసుకుందాం. ఆ విద్యార్థి రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తులో తల్లి అయి ఉండాలి.
AKSO READ: జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్.. స్పెషల్ టీమ్ అదుపులో
కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి. నమోదు చేసుకోని తల్లులు, పిల్లలను వెంటనే గృహ డేటాబేస్‌ల్లో నమోదు తప్పనిసరి. ఇంట్లోని తల్లులు తమ బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించి కచ్చితంగా E-KYC కచ్చితంగా ఉండాల్సిందే. బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి లేకుంటే డబ్బులు పడవు. అలాగే NPCIతో కచ్చితంగా లింక్ చేసి ఉండాలి.
గృహ డేటాబేస్ నమోదు ప్రక్రియకు రాష్ట్రంలో ప్రాథమిక కేంద్రాలుగా పని చేస్తాయి. అందులో నమోదు చేయడానికి అవసరమైన సమాచారాన్ని సిబ్బంది అందిస్తారు. అక్కడికి వెళ్లేటప్పుడు కొన్ని పత్రాలు కచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. తల్లి, పిల్లల ఆధార్ కార్డులు కచ్చితంగా ఉండాలి. అలాగే రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఈ విషయాన్ని దయచేసి మరిచిపోవద్దు. బ్యాంకు ఖాతా వివరాలు, పిల్లల వివరాలు తీసుకెళ్లాలి. అందులో పిల్లల జనన ధృవీకరణ సర్టిఫికెట్, 75 శాతం హాజరు ధృవీకరణ సర్టిఫికెట్ ఉండాలి. తల్లికి వందనం పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆఫ్‌లైన్ పద్ధతులు ఉన్నాయి. గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు అక్కడి సిబ్బందికి సమర్పించవచ్చు. వాటిని అధికారులు నిర్ధారిస్తారు. ఆ తర్వాత ఆర్థిక సహాయం నేరుగా సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతాలో జమ కానుంది.