BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా షాకింగ్ నిర్ణయం.. ప్రభావతికి బిగ్ షాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలు కోసం మీనా షాకింగ్ నిర్ణయం.. ప్రభావతికి బిగ్ షాక్..

Gundeninda GudiGantalu Today episode june 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. పూలమాలలున్న ఆటోని ఎవరో ఎత్తుకెళ్లారని బాలు మీనా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఆటో డ్రైవర్ల గ్రూపులో ఈ విషయాన్ని చెప్పడంతో డ్రైవర్ల అందరూ అలర్ట్ అయ్యి బాలు చెప్పిన ఆటో వెతకాలి. ఒక డ్రైవర్ ముందు నుంచే ఆటో వెళ్లడం చూసిన అతను బాలుకి విషయాన్ని వెంటనే చెప్తాడు. ఇక బాలు ఆటో ఎక్కడికి వెళ్తుందో లైవ్ లొకేషన్ పంపించు అని అడుగుతాడు. అటు రాజేష్ కూడా ఈ ఆటో కనిపించడంతో అందరూ డ్రైవర్లు కలిసి ఆటోను పట్టుకోడానికి వెళ్తారు. మొత్తానికి ఆటో దొరికేస్తుంది. అందర్నీ చూసి ఆటోలో ఉన్న వ్యక్తి పారిపోతుంటే పట్టుకొని చితక్కొడతారు. వీరబాబు బాలు మాట నిలబెట్టడంతో ఎక్కువ డబ్బులు ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి పార్లర్కి వెళ్తుంటే ప్రభావతి ఆపుతుంది. నువ్వు ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇస్తుంటావు. కానీ కొందరు ఉన్నారు కూరగాయలు కానీ సరుకులు కానీ ఏ దానికి డబ్బులు ఇవ్వరు పైగా నా పేరు పెట్టుకున్నారు అంటూ ఎద్దేవా చేసి మాట్లాడుతుంది. ఇది విన్న మీనా పైకి గదిలోకి వెళ్లి డబ్బులు లెక్కపెట్టి కిందకి వస్తుంది. ప్రభావతి రోహిణి ఇద్దరూ డబ్బులు ఇస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మీనా అన్ని అప్పచెప్పి డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ కోసమైనా కారు నమ్మారు కదా అన్న.. ఇప్పుడు ఆటోతో కష్టపడుతున్నాడు.. కారును కొనిద్దామని అనుకుంటున్నానని అనగానే వాళ్లంతా సంతోష పడతారు.

నాకోసం ఏమైనా చాలా కష్టపడ్డాడు కదా ఆయనకు నేను కారు కొనివ్వాలని అనుకుంటున్నాను అని మీనా అంటుంది.. కారు కొనడానికి డబ్బులు మిగిలాయా మరి అని రాజేష్ అడుగుతాడు. ఫస్ట్ హ్యాండ్ కార్ కొనాలంటే దగ్గర దగ్గర 10 లక్షల పైగానే అవుతాయి. అందుకే మనం సెకండ్ హ్యాండ్ కారు కొనడం ఈజీ.. బాలు ఆటో తీసుకోక ముందు కారును చూసాడు. మూడు లక్షలు చెప్పాడు అంతలేదు. మొత్తం మూడు లక్షలు అంటే ఇప్పుడు కష్టం కదా అన్నయ్య ఎలా చేయాలి అని నేను అడుగుతుంది. మొత్తం అంతా కట్టాల్సిన అవసరం లేదమ్మా ఈ అమ్మాయిలో నెలనెలా కట్టుకోవచ్చని రాజేష్ అంటాడు. మరి ఆ కారుని మనం ఒకసారి చూసేద్దాం అన్నయ్య అనేసి మీనా అంటుంది.


ముగ్గురు కలిసి కారును చూడడానికి షెడ్డు కు వెళ్తారు. కారును చూసి ఇది సెకండ్ హ్యాండ్ అంటే ఎవరు నమ్మరు చాలా బాగుంది అనేసి అందరు అనుకుంటారు. కారు షెడ్ ఓనర్ వచ్చి నీ దగ్గర అంత డబ్బులు ఉంటే వచ్చి కట్టేయి అని అంటాడు. అంత డబ్బులు అంటే లేవండి అని మీనా అంటుంది. అంతా కట్టాల్సిన అవసరం లేదమ్మా డౌన్ పేమెంట్ గా 80000 వేలు కట్టి ఆ తర్వాత నెల నెల ఎంతో కొంత డబ్బులు కడితే సరిపోతుంది అని అంటాడు. త్వరగా డబ్బులు అరెంజ్ చేసుకున్నమ్మా ఈ కార్ కోసం చాలామంది పోటీలో ఉన్నారు అని అంటాడు. రేపటికల్లా డబ్బులు అరేంజ్ చేసుకుని చెప్పండి అమ్మ అనేసి అంటారు.

రాత్రి ఇంటికి వచ్చిన బాలు చేతులు నొప్పులుగా ఉన్నాయని బాధపడుతూ ఉంటాడు. ఇక మీనాను వంటగదిలన్ని పనులు చేసి అలసిపోయేవాన్ని బాలు అడుగుతాడు. సరే మీరు ఇలా పడుకోండి నేను కాసేపు ఒళ్ళు పడతానని నేను అడుగుతుంది. రోజంతా నువ్వు ఇంట్లో కష్టపడి మళ్లీ నాకు ఒళ్ళు పడతావా ఏం వద్దులే అనేసి బాలు అంటాడు. కానీ మీనా మాత్రం మీరు రోజంతా కష్టపడుతున్నారు కదా నేను పడతానని ఒళ్ళు పడుతుంది. అయితే ప్రభావతి మీనా అని అరవగానే కంగారుపడి బాలు మీద పడుతుంది.

వీరిద్దరిని చూసి ప్రభావతి హాల్లోకి రావాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పటికైనా రావచ్చా అని అడుగుతుంది. వెనకాలే సత్యం వచ్చి ఏమైందిరా ఎందుకు మీ అమ్మ రాత్రిపూట కూడా అరుస్తుంది అని అడుగుతాడు.. రాత్రిపూట అమ్మకి ఎవరు దొరక్కపోతే దోమలనైనా అరవాల్సిందే కదా నాన్న అని బాలు సెటైర్లు వేస్తాడు. అయితే ఏమైంది అని సత్యం అడుగుతాడు. రాత్రిపూట హాల్లోకి రావాలంటే నాకు ఇబ్బందిగా ఉంది వీళ్ళిద్దరితో అని ప్రభావతి అంటుంది.. అవును నాకు కూడా అదే అనిపిస్తుంది బాలు మీరు వెళ్లి నీ గదిలో పడుకోండి మేము హాల్లో పడుకుంటాము అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది.

మన గది ఇస్తే మీరు ఎక్కడ పడుకుంటారు. మళ్లీ హాల్లో పడుకుంటారా..? మళ్లీ హాస్పిటల్ పాలవుతారా? అనేసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది ప్రభావతి.. అమ్మ డబ్బావతి మాకు ఏ గది వద్దు మీరు వెళ్లి పడుకోండి అని బాలు అంటాడు.. ఉదయం లేవగానే మీ నాకు సుమతి ఫోన్ చేస్తుంది. బస్తీ వాళ్లు డబ్బులు తీసుకోలేదు అంట కదా అక్క అని అడుగుతుంది. నా మీద అభిమానంతోనే వాళ్ళు డబ్బులు తీసుకోలేదు సుమతి అని మీనా అంటుంది.

సరే మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నావ్ అక్క అని సుమతి అడుగుతుంది. ఈ డబ్బులతో మీ బావకి కారు కొనాలని అనుకుంటున్నాను అని మీనా చెప్తుంది. కారు పోవడానికి కారణం మన శివానే కదా.. అందుకే నేను కార్ని కొనిద్దామని అనుకుంటున్నాను అంటుంది మీనా.. అయితే నాకు ఒక 20,000 డబ్బులు కావాల్సి వచ్చింది అని నేను అడుగుతుంది. దానికి సుమతి చక్రపాణి గారు వడ్డీకి ఇస్తారు ఆయన పూల కొట్టు చూసి మాత్రమే వడ్డీకి ఇస్తారు అని అంటుంది. పర్లేదు సుమతి ఆయన రమ్మని చెప్పు అని అంటుంది.. ప్రభావతి బట్టలు ఆరెస్తూ ఉంటే బయట ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు.

ప్రభావతి ఆయన దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు? మా ఇంటిని అటు ఇటు చూస్తున్నావు కొంపతీసి దొంగవా అని అడుగుతుంది. నువ్వెవరు అని ఆయన అడుగుతాడు. సుమతి వాళ్ళ అక్క కోసం నన్ను పంపించింది అని చెప్తాడు. మీనా పూల షాపును చూసి ప్రభావతిని తిడుతూ.. మొత్తానికైతే ఆ చక్రపాణి మీనా చేత సంతకం పెట్టుకుని డబ్బులు ఇస్తాడు. మీనా ఆ డబ్బులు తీసుకొని బయటకు వెళ్తుంది. ఇక రోహిణి పార్లర్కి మనోజ్ వస్తాడు. అక్కడ పార్లర్ పేరు మారి ఉండడం చూసి షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Sravanthi Chokkarapu: తెల్లారితే పెళ్లి.. రాత్రికి రాత్రే ఆపని చేసిన  స్రవంతి..బయటపడ్డ నిజాలు!

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతిలను విడగొట్టిన పల్లవి.. పోలీస్ స్టేషన్ పార్వతి.. నిజం బయటపడిందా?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Stories

×