E-Paper
Advertisement

Taraka Ratna: ఇంకా విషమంగానే.. తారకరత్న కండీషన్ పై ఆందోళన..

Taraka Ratna: ఇంకా విషమంగానే.. తారకరత్న కండీషన్ పై ఆందోళన..
Advertisement

Taraka Ratna: ఏమాత్రం బెటర్ మెంట్ లేదు. రెండు రోజులుగా అదే పరిస్థితి. తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రికి షిఫ్ట్ చేసినా.. ఆయన ఆరోగ్యం అసలేమాత్రం మెరుగు అవడం లేదు. ఎందుకంటే.. ఆయన గుండెలో బ్లాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయట. ఎడమవైపు ఏకంగా 90 శాతం వాల్వ్స్ పూడుకుపోయాయని చెబుతున్నారు వైద్యులు. గుండె పనితీరు సరిగా లేకపోవడంతో.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. సోమవారం మరిన్ని కీలక పరీక్షలు చేస్తామని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు.

తారకరత్నను చూసేందుకు నందమూరి కుటుంబం బెంగళూరు వెళ్లింది. తండ్రి మోహనకృష్ణ, బాలకృష్ణ, పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, చైతన్య కృష్ణ తదితరులు హాస్పిటల్ లోనే ఉన్నారు. తారకరత్న కోమాలో ఉన్నారని చైతన్య కృష్ణ చెప్పారు.

Advertisement

చంద్రబాబు సైతం బెంగళూరు వెళ్లారు. నారాయణ హృదయాలయ వైద్యులతో మాట్లాడారు. తారకరత్నకు అందిస్తున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నారని.. గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటంతో కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారని చంద్రబాబు అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆదివారం బెంగళూరు వెళ్లనున్నారు.

దేవినేని ఉమా, చినరాజప్ప, పరిటాల శ్రీరామ్ తదితర టీడీపీ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో నందమూరి అభిమానులు తరలి వచ్చారు. హాస్పిటల్ దగ్గర పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×