AP Govt – TG Govt: ఔను మీరు విన్నది నిజమే. ఆ విషయంలో మాత్రం తెలంగాణ ను ఏపీ ఫాలో కానుంది. అదేంటీ అసలు 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ చరిత్ర గల ఏపీ సీఎం చంద్రబాబు ఇలా ఫాలో కావడం ఏమిటని అనుకుంటున్నారా.. నేరుగా మంత్రులతో కూడా ఇదే విషయంపై చంద్రబాబు చర్చించారట. ఇంతకు తెలంగాణ ఏం చేసింది? ఏపీ ఫాలో అవుతున్న విషయం ఏంటో తెలుసుకుందాం.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో జరుగుతున్న ఘటనలపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. అది కూడా కొందరు అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాసిరకం ఆహారా పదార్థాలు ఉంటే, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక్క కామెంట్ ఈ సంధర్భంగా దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది.
మన రైతులు సన్న బియ్యం పండిస్తే, అదే బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీకి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే గురుకులాలకు కూడా మన రైతులు పండించిన బియ్యాన్ని పంపిణీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇలా సన్న బియ్యం సాగు చేసే రైతులకు, ప్రోత్సాహం కింద ప్రభుత్వం అదనంగా రూ. 500 లు అందించింది. దీనితో తెలంగాణ రైతుల్లో సన్న బియ్యం సాగుపై అమిత ఆసక్తి ఏర్పడింది. ఈ హామీతో తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఇదే ఏపీ కూడా ఫాలో కానుంది. ఇటీవల సీఎం చంద్రబాబు కలెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన సమయంలో, రేషన్ బియ్యంపై చర్చ వచ్చింది. రేషన్ బియ్యంను ప్రజలు ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా లేదా అంటూ సీఎం ప్రశ్నించారు. దీనిపై మంత్రి వయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం సాగుకు అందిస్తున్న ప్రోత్సాహం, రేషన్ కార్డుదారులకు అందించే తీరు గురించి వివరించారు. దీనితో సీఎం చంద్రబాబు కూడా అక్కడి అధికారులను ఈ విషయంపై ఆలోచించాలని ఆదేశించారట.
Also Read: Kejriwal Ambedkar Row: అంబేడ్కర్‌కు అమిత్ షా అవమానం.. మౌనంగా నితీశ్ కుమార్, చంద్రబాబు?
రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాలలో కూడా మనం సాగు చేసే ధాన్యం, మనకే అందితే కలిగే లాభాల గురించి చర్చలు సాగుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణను ఫాలో అయ్యే రీతిలో ఏపీతో పాటు, ఇతర రాష్ట్రాలు కూడా సిద్దం కానున్నాయట. ఏదిఏమైనా సన్నబియ్యం సాగు చేసే రైతులకు ఇదొక శుభపరిణామంగా చెప్పవచ్చు.