E-Paper
Advertisement

Tirumala tiger attack news : చిరుతదాడిపై చంద్రబాబు రియాక్షన్.. కోవూరు ఎమ్మెల్యే కాంట్రవర్సీ స్టేట్‌మెంట్..

Tirumala tiger attack news : చిరుతదాడిపై చంద్రబాబు రియాక్షన్.. కోవూరు ఎమ్మెల్యే కాంట్రవర్సీ స్టేట్‌మెంట్..
Advertisement
Tirumala tiger attack news

Tirumala latest news today(Latest telugu news in AP) : తిరుమల కాలిబాటలో చిరుతదాడి చేసి చిన్నారిని చంపేయడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ వైఖరి వల్లే చిన్నారి చనిపోయిందనే ఆక్రోశం లక్షిత స్వగ్రామంలో వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెంలో లక్షితను కడసారి చూసేందుకు ఊరు ఊరంతా కదిలొచ్చింది. కన్నీరు పెట్టింది. ఈ మరణానికి నూటికి నూరు శాతం టీటీడీదే బాధ్యత అని మండిపడుతున్నారు. ఇటీవల ఓ బాలుడిపై దాడి చేసినప్పుడే.. అధికారులు తగు రక్షణ చర్యలు తీసుకుని ఉండుంటే.. ఇప్పుడిలా నిండుప్రాణం క్రూరమృగానికి బలి కాకపోయేదిగా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

అంతా టీటీడీపై విరుచుకుపడితే.. చిన్నారి లక్షిత మృతిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాప తల్లిదండ్రుల పాత్రపై అనుమానాలు ఉన్నాయంటూ కామెంట్ చేశారు. లక్షిత తల్లిదండ్రులను విచారించాలని కూడా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఇక, లక్షిత మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే ఓ బాలుడు మృతి చెందాడని.. అప్పటి నుంచి టీటీడీ రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ రోజు ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. పాప తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టి భక్తుల్లో ఉన్న భయాలను తొలగించాలని కోరారు చంద్రబాబు.

Related News

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

Big Stories

Advertisement
×