Pulivendula: వైసీపీ కోట పులివెందులలో ఏం జరుగుతోంది? స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ఎంతవరకు వచ్చాయి? బైపోల్ రేసు నుంచి వైసీపీ తప్పుకుంటుందా? టీడీపీ రంగంలోకి దిగుతుందా? దీనిపై టీడీపీ హైకమాండ్ ఏమంటోంది? పులివెందుల కోటను బద్దలు కొడుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో ఖాళీ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. పులివెందుల నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీ సీట్లకు ఉన్నాయి. వాటికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వాటిలో ఒకటి పులివెందుల కాగా, మరొకటి ఒంటిమిట్ట సీటు. ఈ రెండు సీట్లకు ఈనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండింటిలో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది టీడీపీ.
హైకమాండ్ సంకేతాలు ఇవ్వడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిలతో చర్చించారు. పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి, తన భార్య లతారెడ్డిని రంగంలోకి దింపనున్నారు. ఒంటిమిట్ట నుంచి టీడీపీ అధ్యక్షుడు నరసింహారెడ్డిని బరిలోకి దిగే అవకాశం ఉంది.
వైసీపీ తరపున గురివిరెడ్డి సుబ్బారెడ్డి-ఒంటిమిట్ట, తుమ్మల హేమంత్‌రెడ్డి -పులివెందుల అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. పులివెందుల నుంచి ఉమాదేవికి నామినేషన్ అందినప్పటికీ తన కుమారుడు హేమంత్‌రెడ్డిని పోటీకి నిలపాలని ఆమె భావిస్తున్నారు.
ALSO READ: జగన్‌కి కొత్త కష్టాలు.. హైకోర్టులో పిటిషన్, ఎందుకు?
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. పులివెందుల నుంచి తుమ్మల హేమంత్‌రెడ్డి, తుమ్మల ఉమాదేవి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒంటిమిట్ట సీటుకు వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి, టక్కోలి శివారెడ్డి, కోనేటి హరి వెంకటరమణ, మధుమూర్తి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
పులివెందులలో విజయం సాధించేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే ఊపు కంటిన్యూ చేస్తే.. రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీకి తిరుగు ఉందని అంచనాలు వేస్తున్నారు ఆ జిల్లా నాయకులు. శుక్రవారం కడప జిల్లాకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉప ఎన్నికలపై నేతలు చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడు లేని విధంగా ఈసారి పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ ఛాలెంజ్ గా మారాయనే చెప్పవచ్చు.