పగలు, రాత్రి అనేవి భూమి భ్రమణం పై ఆధారపడి ఉంటాయి. భూ భ్రమణంలో మార్పులు వస్తే అది పగలు రాత్రి పై కూడా పడతాయి. ప్రస్తుతం భూమి సాధరణ వేగం కంటే అత్యధిక వేగంగా తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల పగటిపూట సమయం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రుని స్థానం అనేది భూమి భ్రమణాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ప్రతిరోజు 24 గంటల నుండి కాలం నుండి 1.33 నుండి 1.51 మిల్లీసెకండ్లు తగ్గడం ప్రారంభం అవుతుందని నివేదిక చెబుతోంది.
ఒకప్పుడు రోజుకు 19 గంటలే
100 నుండి 200 ఏళ్ళ క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండేవాడు. దీంతో గురుత్వాకర్షణ ఎంతో ప్రభావాన్ని చూపించేది. ఆ సమయంలో రోజులో 19 గంటలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనకి రోజులో 24 గంటలు. సుమారు 70 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి భ్రమణం దాదాపు 23½ గంటలు ఉండేదని పరిశోధనలో తేలింది. చంద్రుడు భూమి నుండి దూరంగా వెళ్లే కొద్దీ రోజులో గంటలు పెరుగుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రెఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ విడుదల చేసిన డేటా ప్రకారం జూలై 2న భూమి తిరిగే వేగంలో మార్పు వచ్చింది. ఇది 24 గంటలు కంటే 1.34 మిల్లీ సెకండ్లు తక్కువ సమయంతో భ్రమించినట్టు తేలింది.
1970లో తర్వాత భూమిపై అతి తక్కువ సమయం కలిగిన రోజుగా గతేడాది జూలై 5, 2024 నిలిచిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజున 24 గంటల్లో దాదాపు 1.66 మిల్లి సెకండ్లు తక్కువ సమయంలోనే భూభ్రమణం పూర్తయింది. గత దశాబ్దంతో పోల్చుకుంటే 24 గంటలకంటే కొంత తక్కువ సమయంలోనే భూమి భ్రమణం చెందుతోంది. గత ఐదేళ్లతో పోలిస్తే భూ భ్రమణం సాధారణ సమయం కంటే అంటే 24 గంటల కంటే చాలాసార్లు తక్కువ సమయంలోనే భ్రమణాన్ని పూర్తి చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాగే జరిగితే భవిష్యత్తులో 24 గంటల సమయం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల పగలు చాలా వరకు తగ్గి రాత్రి సమయం పెరిగే అవకాశం ఉంది.
అయితే ఇది జరగడానికి 100 ఏళ్ల సమయం పట్టొచ్చు. ఎందుకంటే భూమి ప్రస్తుతం మిల్లీ సెకండ్లలోనే తేడా చూపిస్తోంది. ఈ సమయంలో తేడా గంటల వరకు రావాలంటే వందేళ్ళకు పైగా పట్టొచ్చు. రెండు వందల ఏళ్ల సమయం కూడా పట్టవచ్చు. అప్పుడు రోజుకి 24 గంటలు కాకుండా అది 23 గంటలకు చేరవచ్చు లేదా అంతకన్నా తక్కువ.