Aamir Khan Apology:బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ (Aamir Khan) తాజాగా నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఈ సినిమాను ప్రారంభించిన మొదటి రోజు నుంచి దీనిని ఓటీటీలో కాకుండా డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే విడుదల చేస్తానని అమీర్ ఖాన్ ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. అన్నట్లుగానే థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకున్న తర్వాత ఈ సినిమాను నేటి (ఆగస్ట్ 1) నుంచి ఆయన తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా చూడడానికి 100 రూపాయలు అద్దె చెల్లించాలి అని అమీర్ ఖాన్ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కొన్ని డివైస్ లలో మాత్రం అద్దె రూ.179 చూపిస్తూ ఉండడంతో ఫిర్యాదులు మొదలయ్యాయి. ఇక దీంతో నిజం తెలుసుకున్న అమీర్ ఖాన్ టీం క్షమాపణలు తెలియజేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అద్దె 100 రూపాయలే.. కానీ..
అమీర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో ఉపయోగించే యూట్యూబ్లో 100 రూపాయలకే ఈ సినిమా అందుబాటులోకి వచ్చినా.. ఆపిల్ పరికరాలలో మాత్రం 179 రూపాయలు చూపిస్తుండడంతో ఆపిల్ యూజర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అమీర్ ఖాన్ టీం కు చేరవేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిత్ర బృందం తాజాగా స్పందిస్తూ ఎక్స్ వేదికగా క్షమాపణలు తెలియజేసింది.
క్షమాపణ చెప్పిన అమీర్ ఖాన్ టీమ్..
“సితారే జమీన్ పర్ చిత్రం యాపిల్ డివైస్లలో అద్దె ఎక్కువగా చూపిస్తోందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అందరిని మేము క్షమాపణలు కోరుతున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి అందరం కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో దీనిని పరిష్కరిస్తాము. అర్థం చేసుకొని సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు” అంటూ పోస్ట్ పెట్టింది. ఒక ప్రస్తుతం ఈ ఎక్స్ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Our sincere apologies 🙏🏽
We just became aware that the cost to rent our film Sitaare Zameen Par is reflecting as ₹179 on Apple devices.
We are trying to resolve this issue as soon as possible.
Thank you for your patience and understanding 🙏🏽
— Aamir Khan Productions (@AKPPL_Official) July 31, 2025
ఓటీటీకి వ్యతిరేకిని అంటున్న అమీర్ ఖాన్..
ఇదిలా ఉండగా.. అమీర్ ఖాన్ మొదటి నుంచి ఓటీటీ వ్యతిరేకిని అని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇండస్ట్రీని కాపాడడం కోసమే తన సినిమాలను ఓటీటీలో కాకుండా యూట్యూబ్లో విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక అందులో భాగంగానే తాను ఇటీవల నటించిన సితారే జమీన్ పర్ మూవీని కూడా యూట్యూబ్లోకి తీసుకొచ్చారు. అంతేకాదు భవిష్యత్తులో తాను నటించే చిత్రాలు మాత్రమే కాకుండా.. గతంలో తాను నటించిన చిత్రాలను కూడా యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. తక్కువ ధరకే సినిమా ఎక్కువ మందికి చేరువ కావాలనే ఉద్దేశంతోనే అమీర్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
సితారే జమీన్ పర్ సినిమా విశేషాలు..
అమీర్ ఖాన్ తాజాగా నటించిన ఈ సితారే జమీన్ పర్ సినిమా విశేషాల విషయానికి వస్తే.. ఆర్.ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్ నటిస్తూనే.. మరొకపక్క అపర్ణ పురోహిత్ తో కలిసి నిర్మించారు. 2007లో వచ్చిన ‘తార్ జమీన్ పర్’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా. ఇందులో అమీర్ ఖాన్ తో పాటు జెనీలియా దేశముఖ్ (Genelia Deshmukh)కూడా నటించారు. 2018 స్పానిష్ చిత్రం ఛాంపియన్స్ కి అధికారిక రీమేక్ ఇది. జూన్ 20వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లు వసూలు చేసింది. అంతే కాదు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా కూడా నిలిచింది.
ALSO READ:Kingdom IBomma : ఏజెన్సీల వల్ల బలైపోయిన కింగ్‌డం… దేవరకొండకు 24 గంటల డెడ్‌లైన్