BigTV English

TDP Janasena Seats Issue : టీడీపీ, జనసేన పొత్తు.. కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు..

TDP Janasena Seats Issue : 2014 ఎన్నికల్లో మిత్రులు. 2019 ఎలక్షన్‌లో మాత్రం విడివిడిగా పోటీ చేశారు. తర్వాత కాలంలో వైసీపీ విధానాలను ఎండగట్టడంతో భాగంగా ఏకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక సీట్లు చీల్చకూడదనే సిద్ధాంతం ఉమ్మడిగా పోటీ చేస్తామంటున్నారు. సీట్ల విషయంలో ఇంకా ఇరుపార్టీల మధ్య స్పష్టత రావపోవటంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించగా.. తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్లు పవన్‌ కూడా రెండు సీట్లు ఎనౌన్స్ చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ ఏకపక్షంగా అభ్యర్దులను ప్రకటించటాన్ని తప్పు బట్టారు. దీంతో పొత్తుపై హీట్‌ మరింత పెరిగింది.

టీడీపీ-జనసేన పొత్తులో సీట్ల సర్ధుబాటు అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికైతే పలుదఫాలుగా భేటీ అయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. మొత్తం 175 సీట్లలో టీడీపీ, జనసేనకు ఎన్నిసీట్లు అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఎంపీ స్థానాల్లోనూ ఎన్ని ఇస్తారనే ఉత్కంఠలో ఇరు పార్టీల శ్రేణులు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే చంద్రబాబు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరికొన్నింటి విషయంలో ఆయా అభ్యర్థులకు అభయం కూడా ఇచ్చారు. ఉమ్మడిగా ఇరుపార్టీలూ కలసి పోటీ చేయాలని నిర్ణయం, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలూ కూడా సాగాయి. కానీ.. జనసేనకు ఇన్ని సీట్లు ఇస్తామనే ప్రకటన రాకపోవటంతో పార్టీ నేతల్లో సస్పెన్స్ నెలకొంది.

పొత్తులో భాగంగా వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే గోదావరి జిల్లాలు సహా జనసేన ప్రభావం ఎక్కువ ఉన్నచోట్లే వారికి సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. టీడీపీ ఏకపక్షంగా టికెట్లను ప్రకటించడంపైనా విమర్శలు వినిపించాయి. తొలిధపాలో భాగంగా ఎవరెకెన్ని స్థానాలు.. ఎక్కడెక్కడ అభ్యర్థులు అనే అంశాన్ని ఉమ్మడి సమావేశం ద్వారా వెల్లడిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ లోపు చంద్రబాబు.. ఇద్దరికి టిక్కెట్ల్ కన్ఫామ్‌ చేసేశారు. దీంతో జనసేన అధినేత కూడా ఇద్దరి అభ్యర్థులను ప్రకటించారు. రాజనగరం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారని ఆయన ప్రకటనతో ఒక్కసారిగా ఎన్నికల హీట్‌ వేడిక్కింది.

టీడీపీతో పొత్తు భవిష్యత్తులోనూ కొనసాగుతోందంటున్న పవన్.. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ మూడోవంతు సీట్లు కావాల్సిందేనంటున్నారు. అది కూడా ఆలస్యం కావటంతో జనసేనాని అధినేత.. ఒక అడుగు ముందుకేసి.. రెండు సీట్లలో అభ్యర్థులను ప్రకటించారట. దానికి తోడు జనసేన కార్యకర్తల నుంచి తనకూ ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రెండు సీట్లపై క్లారిటీ ఇచ్చేశారట. ఇప్పటికే ఇతరపార్టీలు సీట్లు, అభ్యర్థుల విషయంలో ఓ అడుగు ముందుకు వేయగా.. మనమూ అదే రీతిలో ముందుకు సాగాయని యోచనలో పవన్‌ ఉన్నట్లు సమాచారం.

పొత్తులో భాగంగా ప్రస్తుతం ఇచ్చే ఎమ్మెల్యే స్థానాల కంటే… స్థానిక సంస్థల్లో తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పవన్‌ కోరినట్లు తెలుస్తోంది. తద్వారా గ్రామస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేసుకునే వెసులుబాటు ఉండటంతో.. ప్రస్తుతం అసెంబ్లీ సీట్లపై పవన్‌.. ఎక్కువ ఒత్తిడి పెట్టేందుకు సిద్ధంగా లేరని సమాచారం. అనుకున్న విధంగా సీట్లు సర్థుబాటు జరిగితే.. రెండు పార్టీలూ కలసి జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చననే పవన్‌ వ్యాఖ్యలకు సార్థకత వస్తుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×