BigTV English

TDP-Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ-జనసేన సీట్ల రాజకీయం.. అధిష్టానం మనసులో ఉన్నదెవరు..?

TDP-Janasena : ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ-జనసేన సీట్ల రాజకీయం.. అధిష్టానం మనసులో ఉన్నదెవరు..?

TDP-Janasena : సీఎం జగన్‌ను ఢీకొట్టి వైసీపీని మట్టికరిపించేందుకు టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగుతుండగా.. ఇరు పార్టీల మధ్య సీట్ల పంచాయితీతో రాజకీయాలు కాకరేపుతున్నాయి. పెనుమలూరు టికెట్ ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌. గెలుపు తనదేననే ధీమాలోనూ ఉన్నారు. అటు విజయవాడ పశ్చిమ టికెట్‌ తనదేనంటున్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్. అయితే.. వీరిద్దరికీ కాకుండా పెనమలూరులో టీడీపీ నుంచి పార్థసారథి.. విజయవాడ పశ్చిమ జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్‌ బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.


ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో జలీల్‌ఖాన్‌ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో పశ్చిమ సీటు తనకే కేటాయించేలా చంద్రబాబుతో మాట్లాడాలని పవన్‌ను కోరినట్టు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా ఇదే ధీమాలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనకు నమ్మకం ఉందని.. తప్పకుండా పార్టీ కోసం పోరాడే వ్యక్తులందరికీ న్యాయం జరుగుతుందంటున్నారు కొనకళ్ల. బోడె ప్రసాద్‌ను కానీ, తనను కానీ ఓదార్చే పని లేదని చెబుతున్నారు. టికెట్‌ రాదన్న ప్రచారాన్ని నమ్మవద్దని.. గతంలోనూ ఇలాంటి అసత్య ప్రచారాలు జరిగాయని.. చంద్రబాబు తమకు న్యాయం చేస్తారంటున్నారు. ఇక నేతలంతా ధీమాను వ్యక్తం చేస్తున్నట్టు అధిష్టానం వారినే ప్రజాక్షేత్ర పోరులో దించనుందా..? లేదంటే అధినేతల మనసులో మరొకరు ఉన్నారా అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.

.


.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×