BigTV English

TTD Chairman: టీటీడీ ఛైర్మన్ పదవి రాజుకే అవకాశాలెక్కువా?

TTD Chairman: టీటీడీ ఛైర్మన్ పదవి రాజుకే అవకాశాలెక్కువా?

TTD Chairman: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్ ఎవరు? చాలామంది రేసులో ఉన్నారా? పార్టీలో సీనియర్లు ఆ పదవిని దక్కుతుందా? లేక పారిశ్రామిక‌ వేత్తలకు ఇస్తున్నారా? రోజుకో పేరు ఎందు కు వెలుగులోకి వస్తోంది? కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఓ ఛానెల్ అధినేత, సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఇలా రకరకాలు పేర్లు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడు తున్నాయి.


ఏపీలో కూటమి సర్కార్‌ వచ్చాక టీటీడీ ఛైర్మన్ పదవికి విపరీతమైన పోటీ నెల కొంది. దీన్ని దక్కించుకునేందుకు పార్టీలో సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు మదిలో ఎవరున్నారు? ఇవే ప్రశ్నలు సీనియర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజుకో పేరు తెరపైకి రావడంతో నేతలకు మరింత టెన్షన్ పెరుగుతోంది.

ఓ టీవీ ఛానెల్ అధినేత పేరు తొలుత పరిశీలనలోకి వచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు తెరపైకి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు బయటకు వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నమాట. తొలుత ఈ పదవికి అశోక్ గజపతిరాజు మొగ్గు చూపలేదట. వయస్సు రీత్యా ప్రశాంతంగా ఉండాలని భావించినట్టు తెలుస్తోంది.


టీటీడీ ఛైర్మన్ పదవికి అయినైతే సరైన వ్యక్తని, క్లీన్ ఇమేజ్ ఉండడంతో ఆయన సరిపోతారనే ముఖ్యమంత్రి దృష్టికి కొందరు నేతలు తీసుకెళ్లారు. ఈ విషయంలో పార్టీలో కీలక నేతలు ఆయనను ఒప్పించినట్టు అంతర్గత సమాచారం. అశోక్ కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

ALSO READ: ఏపీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం, కేబినెట్ ఆమోదం తర్వాత..

ఈ వార్తలకు సీఎం చంద్రబాబు పుల్‌స్టాప్ పెడతారా? ఆ పదవిని కొద్దిరోజులపాటు పెండింగ్‌లో పెడతారా? లేక రేపటి రోజున ఇంకొంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయా? ఇవే ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×