BigTV English

Big TV Exclusive : ‘రాబిన్ హుడ్’ రాక ఆరోజు కష్టమే… మంచి రిలీజ్ డేట్ ను చేజార్చుకోనున్నారా?

Big TV Exclusive : ‘రాబిన్ హుడ్’ రాక ఆరోజు కష్టమే… మంచి రిలీజ్ డేట్ ను చేజార్చుకోనున్నారా?

Big TV Exclusive : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’  మూవీని ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత అనౌన్స్ చేసి గుడ్ న్యూస్ చెప్పారు. కానీ అంతకుముందు వరకు ఈ సినిమా డిసెంబర్ 20 న థియేటర్లలోకి రాబోతోందని జోరుగా ప్రచారం నడిచింది. కానీ క్రిస్మస్ బరిలో నుంచి తప్పుకొని సంక్రాంతి పోటీలో ‘గేమ్ ఛేంజర్’ నిలవబోతుండడంతో ఇప్పుడు టాలీవుడ్ లో పలు సినిమాల రిలీజ్ డేట్ల లెక్కలు మారుతున్నాయి. అప్పటికే డిసెంబర్ 20పై కన్నేసిన కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటే, మరికొన్ని సినిమాలను మాత్రం అప్పుడే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డిసెంబర్ 20న రాబోతున్నానని ‘రాబిన్ హుడ్’ అనౌన్స్ చేశాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆరోజు నితిన్ రాక కష్టమే అని తెలుస్తోంది.


‘రాబిన్ హుడ్’ రాక కష్టమే

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘రాబిన్ హుడ్డ్’. ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 20నే రిలీజ్ చేయబోతున్నట్టు గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ‘గేమ్ చేంజర్’ మూవీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించడంతో ‘రాబిన్ హుడ్’ను పోస్ట్ పోన్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ యూ టర్న్ తీసుకొని సంక్రాంతికి వెళ్లడంతో మొదట ప్రకటించిన తేదీకే ‘రాబిన్ హుడ్’ రాబోతున్నట్టు మరోసారి క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘రాబిన్ హుడ్’ డిసెంబర్ 20 న రావడం కష్టమని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన చాలా వర్క్ పెండింగ్ లో ఉండడంతో ఆరోజు ‘రాబిన్ హుడ్’ రాక కష్టం కాబట్టి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.


లక్కీ ఛాన్స్ పోగొట్టుకున్నట్టే.. ?

మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 70 కోట్ల వరకు ఖర్చు పెట్టి తీస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం మొదలైంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచారు మేకర్స్. కానీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్లో సినిమా రిలీజ్ కష్టమే అనేది తాజా సమాచారం. ఒకవేళ ఈ వార్తలు కనుక నిజమైతే రాబిన్ హుడ్ మంచి రిలీజ్ డేట్ ని వదులుకున్నట్టే. డిసెంబర్ 20 అనేది నితిన్ కి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. అప్పుడు రిలీజ్ అయితే క్రిస్మస్ సెలవులతో పాటు కొత్త ఏడాది, సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అయ్యేదాకా సినిమా ఆడే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రిలీజ్ డేట్ ని చేజార్చుకుంటే ఆ తర్వాత రిలీజ్ డేట్ దొరకడం కూడా కష్టమే. ఇక ఇదే రిలీజ్ డేట్ ను ‘సారంగపాణి జాతకం’తో ప్రియదర్శి క్యాష్ చేసుకుంటున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×