TDP Cadre News: ఆధారాలు కరెక్ట్‌గా ఉన్నా.. కేసులు కూడా అంతే బలంగా ఉన్నా.. మరి జైలుకెళ్లిన వాళ్లు త్వరగా ఎందుకు బయటకొచ్చేస్తున్నారు.!! ఇప్పుడిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో టీడీపీ శ్రేణులకు ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అసలు ఏం జరుగుతుంది..?
కేసులను వాదించడంలో లోపమా..? సాక్ష్యాలను చూపించడంలో నిర్లక్ష్యమా…? లేకుంటే ప్రతివాదులను ఎదుర్కోలేకపోవడమా..? ఇంతకీ అసలు ఏం జరుగుతోంది..! చంద్రబాబును జైలులో పెడితే 55 రోజులైనా బయటకు తీసుకురాలేకపోయారు. విజయవాడ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రోజుల తరబడి తిప్పారు. అప్పట్లో అంత బలంగా వైసీపీ ప్రభుత్వంలో వాదనలు కొనసాగాయి.
‘‘మరి ఇప్పుడేంటి ఏ కేసులోనూ గట్టిగా వాదించలేకపోతున్నారనే టాక్ విపరీతంగా వినిపిస్తోంది. ప్రభుత్వం ఎందుకు వాదనలను గట్టిగా వినిపించలేకపోతోందన్న’’ చర్చ TDP శ్రేణుల్లో సాగుతోంది. మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డి పాత్ర ఉందని సాక్షాత్తూ వైసీపీ నేతలే చెబుతున్నా.. ఆయనను ఎందుకు లాక్ చేయలేకపోతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది.
ఇంతకీ లోపం ఎక్కడా..?
మరోసారి కూడా హైకోర్టులో ఇదే కేసులో మిథున్‌రెడ్డికి ఊరట లభించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 3 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సీఐడీని ఆదేశించింది. కేసుకు సంబంధించి ఆధారాలు ఉన్నా, సాక్ష్యాలు సేకరిస్తున్నా.. ప్రాథమిక దశలోనే కేసులు ప్రతివాదులకు అనుకూలంగా ఎలా మారుతున్నాయి..? లోపం ఎక్కడ ఉందో? ఇప్పుడే సరిచేసుకుని బలమైన వాదనలు వినిపించాలంటూ టీడీపీలో కింది స్థాయి నేతలు, కేడర్ గుసగుసలాడుకుంటున్నారు.
వైసీపీ సుధాకర్ రెడ్డి లీగల్ టీమే బెటరా?
ఆధారాలు కరెక్ట్‌గా ఉన్నాయి. కేసులు అంతే బలంగా ఉన్నాయి.
మరి జైలుకెళ్లిన వాళ్లు త్వరగా ఎందుకు బయటకొచ్చేస్తున్నారు..?
ఇప్పుడిదే టీడీపీలో హాట్ టాపిక్.
కేసులను వాదించడంలో లోపమా, సాక్ష్యాలను చూపించడంలో నిర్లక్ష్యమా..?
ప్రతివాదులను… pic.twitter.com/UTlIwfJ5j2
— BIG TV Breaking News (@bigtvtelugu) March 26, 2025
ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..
ALSO READ: Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..