Jaabilamma Neeku Antha Kopama: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా, నిర్మాతగానే కాదు.. దర్శకుడుగాను దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం’ (Nilavuku En Mel Ennadi Kobam) ధనుష్ మేనల్లుడు పవిష్ ఈ కథతో హీరోగా పరిచయమయ్యాడు. తెలుగులో ఈ సినిమాను ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అనే టైటిల్‌తో డబ్బింగ్ చేశారు. ఈ సినిమాలో అనైక సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రియాంక అరుళ్ మోహన్ తదితరులు నిటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌కె ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించాయి. ఈ సినిమా అటు తమిళ్, ఇటు తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. కుర్రాళ్లకు ఈ సినిమా తెగ కనెక్ట్ అయిపోయింది.
మారిన ఓటిటి సంస్థ
రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సొంతం చేసుకుంది. థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయిన వారంతా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కోసం వెయిట్ చేశారు. మార్చి 21 నుంచి అమేజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కానీ తెలుగు ఓటిటి సంస్థ మారినట్టుగా ప్రకటించారు. తెలుగులో సింప్లీ సౌత్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఈ సినిమా లవర్స్ ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
జాబిలమ్మ నీకు అంత కోపమా కథ ఇదే!
ఈ సినిమా ఒక సాధారణ, యువతకు సంబంధించిన ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ప్రభు (పవిష్ నారాయణ్) అనే యువకుడు చెఫ్‌గా పనిచేస్తూ, నీల (అనిఖా సురేంద్రన్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. వీరి మధ్య ప్రేమ, బ్రేకప్, మరియు తిరిగి కలవాలనే ప్రయత్నాలు కథలో ప్రధాన అంశాలు. ఇందులో రాజేష్ (మాథ్యూ థామస్) మరియు శ్రేయ (రబియా ఖాతూన్) వంటి స్నేహితుల పాత్రలు కామెడీ మరియు ఎమోషనల్ డెప్త్‌ను జోడిస్తాయి. అంజలి (రమ్య రంగనాథన్) అనే పాత్ర కూడా కథలో ఒక ట్విస్ట్‌ను తీసుకొస్తుంది. చివరికి ప్రభు మరియు నీల మధ్య ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ. ఒక సింపుల్ లవ్ స్టోరీ అయినప్పటికీ, ధనుష్ దాన్ని ఎంటర్‌టైనింగ్‌గా మరియు యువతకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు. కామెడీ సన్నివేశాలు, ట్రెండీ డైలాగ్‌లు, మరియు ఆకర్షణీయమైన విజువల్స్ సినిమాకు బలంగా నిలిచాయి. అయితే, కథలో కొత్తదనం లేకపోవడం మరియు క్లైమాక్స్ కొంత అసంపూర్ణంగా అనిపించడం వల్ల కొందరు ప్రేక్షకులకు నిరాశ కలిగించి ఉండవచ్చు. కానీ విడుదలైన రెండు భాషల్లోను మంచి విజయాన్ని అందుకుంది. మొత్తంగా, “జాబిలమ్మ నీకు అంత కోపమా” ఒక సరదాగా, హాయిగా చూడదగ్గ సినిమా, ముఖ్యంగా యువతకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. మరి ఓటిటిలో ఎలా అలరిస్తుందో చూడాలి. అన్నట్టు.. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.