Betting Apps: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయనుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పై కేసులు కఠినంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూచర్ లో మరోసారి ఇలాంటి కేసులు నమోదు కాకుండా కూడా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మందిపై కూడా కేసులు నమోదు అయ్యాయి. అలాగే సైబరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేస్తున్న 25 మంది సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ముఖ్యంగా య్యూటబర్ల వాళ్ళ స్వార్థం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ.. అమాయక యువతను బలి చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలో టాలీవుడ్ అగ్రహీరోల నుంచి యూట్యూబర్ల వరకు పోలీసులు వరుసపెట్టి కేసు నమోదు చేస్తున్నారు.
ఇప్పటికే కొంత మంది సినీ సెలబ్రెటీలకు నోటీసులు పంపి.. విచారణకు కూడా పిలుస్తున్నారు. విదేశాలకు పరారయిన కొంతమంది సెలబ్రెటీలను పోలీసులు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కేసుల్లో భాగంగా.. ఇప్పటికే కొంత మంది కింది స్థాయి యూట్యూబర్లకు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. విదేశాలకు పరారైన వారు సొంత రాష్ట్రాలకు రాగానే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయనుంది.
ALSO READ: BYD Car In Telangana: తెలంగాణకు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. హైదరాబాద్‌లో బీవైడీ కారు యూనిట్