TDP Youtube Channel: తెలుగుదేశం పార్టీ అధికార యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. బుధవారం ఉదయం నుంచి హఠాత్తుగా ఆగిపోయింది. ఛానల్ ఓపెన్ చేసిన వారికి స్ట్రక్ అయినట్లు వస్తుందని కొందరు నేతలు పేర్కొన్నారు. దీంతో హ్యాక్ చేసిన వారిని గుర్తించేందుకు టీడీపీ టెక్నికల్ వింగ్ రంగంలోకి దిగింది. మరోవైపు టీడీపీ వర్గాలు యూట్యూబ్ యాజమాన్యంకు ఛానల్ హ్యాక్ అయిందని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఛానల్ పునరుద్దరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
టీడీపీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవడంతో అందులో ప్రసారాలు అన్ని ఆగిపోయాయి. ఆ ఛానల్లో టీడీపీ వర్గానికి సంబంధించిన ప్రెస్ మీట్‌లు, సీఎం చంద్రబాబు పర్యటనలు, పలు మీటింగ్‌లు, కార్యకర్తలు మాట్లాతున్న లైవ్‌లు, పార్టీకి సంబంధించి పలు కార్యక్రమాలు యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారమవుతాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, పలువురు ఈ ఛానల్‌ను ఫాలో అవుతుంటారు. అయితే బుధవారం ఉదయం ఛానల్ ఓపెన్ చెయ్యగా ‘ది పేజ్ నాట్ అవేలబుల్'(the page is not available) అని చూపించడంతో.. అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో టీడీపీ కార్యాలయానికి వెంటనే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎవరు హ్యాక్ చేశారని తెలుసుకునే పనిలో ఐటీ టీమ్ రంగంలోకి దిగింది.
తెలుగుదేశంపార్టీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్‌కు గురైందని గుర్తించారు. ఈ విషయంపై యూట్యూబ్ యాజమాన్యానికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరలా ఛానల్ పునఃప్రారంభించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఛానల్ పునరుద్ధరించేందుకు కేంద్ర కార్యాలయ వర్గానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఒకేసారి 8 మంది టీడీపీలోకి.. జగన్‌కు బాబు బర్త్‌డే గిఫ్ట్
అయితే గతంలో టైలర్ హాబ్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు.. టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అవడంతో అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పార్టీకి సంబంధించి ఛానల్‌లో వచ్చే ప్రతి విషయాన్ని టీటీపీ నేతలు ఫాలో అవుతుంటారు. ఛానల్ హ్యాక్ అవడం ఇదే మొదటిసారి అని టీడీపీ నేతలు చెప్పారు. ఈ తరుణంలో యూట్యూబ్ ఛానల్‌ను హ్యాక్ చేసింది ఎవరు..? ఎక్కడి నుంచి చేశారన్న కోణంలో టెక్నికల్ విభాగం ప్రయత్నిస్తోంది.