BigTV English

Ravichandran Ashwin Retirement: క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు

Ravichandran Ashwin Retirement: క్రికెట్ కు అశ్విన్ వీడ్కోలు

Ravichandran Ashwin Retirement: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కి {Ravichandran Ashwin Retirement} వీడ్కోలు పలికాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బెన్ లోని గబ్బా వేదికగా జరిగిన మూడవ టెస్ట్ చివరి రోజు అశ్విన్ తన రిటైర్మెంట్ ని ప్రకటించేశాడు. ఈ టెస్ట్ లో అశ్విన్ కి చోటు దక్కలేదు. అయితే ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read: Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ పై సెలబ్రేషన్స్… టీమిండియా ఫ్యాన్స్ సీరియస్?

ఇక తన రిటైర్మెంట్ ని ప్రకటిస్తూ అశ్విన్ {Ravichandran Ashwin Retirement} కి బీసీసీఐ ప్రత్యేక అభినందనలు తెలిపింది. అశ్విన్ ని భారత జట్టులో అమూల్యమైన ఆల్ రౌండర్ గా పేర్కొంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన అశ్విన్.. తన 14 ఏళ్ల కెరియర్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలుపుతూ భావద్వేగానికి గురయ్యాడు. నిజానికి పెర్త్ టెస్ట్ గెలుపు తరువాతే రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నానని.. కానీ రోహిత్ శర్మ పింక్ బాల్ టెస్ట్ ఆడేలా తనని ఒప్పించినట్లు తెలిపాడు. ఇక టెస్ట్ కెరీర్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా నిలిచాడు అశ్విన్.


తన కెరీర్ లో 16 టెస్టుల్లో 24 యావరేజ్ లో 537 వికెట్లు తీసుకున్నాడు అశ్విన్. అనిల్ కుంబ్లే తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు. అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసి మొదటి స్థానంలో నిలిచాడు. 38 ఏళ్ల వయసులో అశ్విన్ {Ravichandran Ashwin Retirement} తన అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. 14 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్ కి తన సేవలను అందించాడు. 2011లో వెస్టిండీస్ పై తొలి టెస్ట్ ఆడాడు రవిచంద్రన్ అశ్విన్. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో వన్డే కెరీర్ ని ప్రారంభించాడు.

Also Read: Prithvi Shaw: సాయి బాబా.. నేను ఇంకేం చేయాలి.. పృథ్వి షా ఎమోషనల్ పోస్ట్!

105 టెస్టులు ఆడిన అశ్విన్ 3,474 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఆరు సెంచరీలు, 14 ఆఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే టెస్ట్ ఫార్మాట్ లో 37 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా అశ్విన్ ఖాతాలో ఉంది. అంతేకాదు ఒక్క టెస్ట్ లో 10 వికెట్లు తీసిన ఘనతను 8 సార్లు సాధించాడు అశ్విన్. అలాగే 116 వన్డేల్లో అశ్విన్ 707 పరుగులు చేశాడు. వన్డేల్లో 156 వికెట్లు పడగొట్టాడు. 65 టి-20 ల్లో 72 వికెట్లను పడగొట్టాడు. పొట్టి ఫార్మాట్ లో 154 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు సడన్ గా {Ravichandran Ashwin Retirement} అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి క్రీడాభిమానులను కాస్త నిరాశకు గురి చేశాడు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×