BigTV English

YS Sunitha: టీడీపీలోకి సునీత.. పోస్టర్ పాలి..ట్రిక్స్!

YS Sunitha: టీడీపీలోకి సునీత.. పోస్టర్ పాలి..ట్రిక్స్!
sunitha poster

YS Sunitha: ఈ పోస్టర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చకు తెరలేపింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు.. వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రొద్దుటూరులో గుర్తు తెలియని వ్యక్తులు వేశారు ఈ పోస్టర్. YS సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ ఆ పోస్టర్‌ లో ఉంది. ఆ పోస్టర్లలో తెలుగుదేశంపార్టీ అని ఉంది. అలాగే YS సునీతతోపాటు.. ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, తండ్రి YS వివేక ఫొటోలు కూడా పోస్టర్లలో ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు డాక్టర్‌ సునీత పోరాటం చేస్తున్న సమయంలో ఈ పోస్టర్లు వేయడం చర్చగా మారింది.


వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా రోజులుగానే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సునీత టీడీపీలో చేరబోతున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా సునీత టచ్‌లో ఉన్నారని కూడా సజ్జల ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్‌ అయింది. ఇప్పుడు ఏకంగా టీడీపీలో చేరబోతున్నారంటూ సునీత పేరిట పోస్టర్లు రావడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పైగా.. ఈ పోస్టర్‌లో చంద్రబాబు, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి ఫొటోలు ఉన్నాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియట్లేదు కానీ.. ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఈ పోస్టర్లపై సునీత నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పోస్టర్లు అన్న ప్రచారం జరుగుతోంది. ఆ పోస్టర్లతో తమకేం సంబంధం లేదని టీడీపీ ప్రకటించింది. అంటే, ఇది వైసీపీ ఆడుతున్న మైండ్ గేమా? ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయబోతోందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. సునీత టీడీపీలో చేరుతున్నారనేలా సీన్ క్రియేట్ చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే గేమ్ ప్లాన్ దాగుందా? సునీత, టీడీపీ వల్లే వివేకా హత్య కేసులో అవినాష్‌ను ఇరికించారనే మెసేజ్ ఇచ్చేందుకేనా ఈ పోస్టర్ పాలి..ట్రిక్స్?


Related News

Nellore News: ఆస్పత్రిలో ఖైదీ రాసలీలలు.. ఏకంగా హాస్పిటల్ బెడ్ పైనే.. ఏంటీ దారుణం?

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

RK Roja: వార్-2 సినిమాను అడ్డుకుంటారా..? రోజా సంచలన వ్యాఖ్యలు

Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

Big Stories

×