
Nara Lokesh: యువగళం పాదయాత్ర సరికొత్త లోకేశ్‌ను పరిచయం చేస్తోంది. సెల్ఫీ ఛాలెంజ్‌లు, పంచ్ డైలాగులతో జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ.. అధికార పార్టీ అవినీతి, అరాచకాలపై విమర్శిస్తూ.. ముందుకు కదులుతున్నారు లోకేశ్. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆసక్తికర స్పీచ్ ఇచ్చారు.
యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ భయపడుతున్నారని.. పోలీసులతో తనను అడ్డుకోవాలని చూస్తే అది వర్కవుట్ కాలేదని.. అందుకే ఇప్పుడు వైసీపీ వారిని రెచ్చగొట్టి తనమీదకు పంపిస్తున్నారని మండిపడ్డారు లోకేశ్. పద్ధతిగా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్రే అంటూ పంచ్ డైలాగ్ వదిలారు.
వివేకా హత్య కేసును దారి మళ్లించేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాబాయ్ హత్య కేసులో కుటుంబం మొత్తం బుక్కైపోయిందని.. ఒక బాబాయ్‌ని లేపేసిన కేసులో మరో బాబాయి కూడా జైలుకు పోయారని ఎద్దేవా చేశారు. త్వరలో అబ్బాయిలు కూడా జైలుకు పోవడం ఖాయమన్నారు. రావాలి జగన్.. కావాలి జగన్ అని చంచల్‌గూడ జైలు పిలుస్తోందని సెటైర్లు వేశారు నారా లోకేశ్. నెక్ట్స్ జైలుకు వెళ్లేది ఎవరనే విషయంపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయని.. జగన్ త్వరలో జైలుకి పోవడం ఖాయమని అన్నారు.