“రూపాయికి ఇడ్లీ వస్తుందే లేదో నాకు తెలియదు కానీ.. ఊరూ పేరూ లేని కంపెనీలకు 3వేల కోట్ల రూపాయలు డబ్బులు దోచిపెట్టి నాకింత, నీకింత అని పంచుకున్నారు.” ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇటీవల మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివి. దీనికి కౌంటర్ గా మరో వీడియో షేర్ చేసింది టీడీపీ సోషల్ మీడియా. జగన్ వెకిలి చేష్టలు, యువత ఉన్నతమైన ఆలోచనలు అంటూ కౌంటర్ వీడియో రిలీజ్ చేసింది. అందులో.. టీసీఎస్ కి 1 రూపాయికి ఎకరా ఎందుకిచ్చారో అర్థమయ్యేలా చెప్పించారు. ఆ ల్యాండ్ ఇచ్చారు కాబట్టే 1500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 12వేలమందికి ఉద్యోగాలు వస్తాయని, అది చిన్నవిషయం కాదని వివరించారు. అందుకే ఏపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. అది జగన్ కి ఎప్పటికీ అర్థం కాదంటూ వీడియో విడుదల చేసి కౌంటర్ ఇచ్చింది టీడీపీ.
ఉద్యోగాల విలువ, టీసీఎస్ నిబద్ధత, ఏపీ ప్రభుత్వం చొరవ చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు.. నిరారక్షితుడివి ..నీకేం తెలుస్తుంది జగన్?#PsychoFekuJagan#FekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/MCekDdOUSU
— Telugu Desam Party (@JaiTDP) April 24, 2025
ఎకరా 99 పైసలు
విశాఖలో టీసీఎస్, ఉర్సా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ రేటుకి భూమిని లీజుకిచ్చిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఎకరా 99 పైసలకు లీజుకివ్వడం సరికాదని ప్రతిపక్ష వైసీపీ అంటోంది. వైసీపీ మద్దతుదారులు కొందరు రూపాయు చేతిలో పట్టుకుని కిరాణా షాపులకు వెళ్లడం, ఇతర షాపులకు వెళ్లి రూపాయికి తమకు తావాల్సిన వస్తువుల్ని అడుగుతున్నారు. అసలు రూపాయికి ఏం వస్తుందయ్యా అనే వారి ప్రశ్నకు.. చంద్రబాబు ఎకరా ఇచ్చేస్తున్నారు కదా అని బదులిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి టీడీపీ నుంచి కూడా గట్టిగానే సమాధానం వస్తోంది. వేల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడాన్ని ఇలా తప్పుబట్టడం సరికాదంటున్నారు టీడీపీ నేతలు.
వైసీపీ పేటీఎం కూలీ బతుకులకు టీసీఎస్కి ఎకరం 99 పైసలకి ఇవ్వడమే కనిపిస్తోంది. టీసీఎస్ ద్వారా ప్రత్యక్షంగా వచ్చే 12 వేల ఉద్యోగాలు, పరోక్షంగా వచ్చే వేల కోట్ల ఆదాయం ఫేక్ జగన్ని నమ్ముకున్న నిరారక్షితులకు ఇంకో జన్మ ఎత్తినా అర్థం కాదు. #TCSInVizagWith12kJobs#JobCreatorInChiefLokesh… pic.twitter.com/6hGZcsV4G2
— Telugu Desam Party (@JaiTDP) April 24, 2025
ఉర్సాకు భూముల కేటాయింపు
ఇక టీసీఎస్ కి ఎకరా 99 పైసలకు లీజుకిచ్చామని, కానీ ఉర్సా సంస్థ మాత్రం ఎకరాకు రూ.50లక్షల చొప్పున 56.6 ఎకరాలు, కోటి రూపాయల చొప్పున 3.5 ఎకరాలు అమ్ముతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చింది. మరో వైపు సీపీఎం నేతలు కూడా విశాఖ భూముల కేటాయింపుపై మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోందని సీపీఎం విమర్శించింది. ఉర్సా సంస్థకు కటాయించే భూములను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు ఆ భూముల వద్ద ఆందోళన చేపట్టారు.
క్యూసెక్కులు, టీఎంసీలు, డయాఫ్రమ్ వాల్… ఇలాంటివి ఏంటో తెలియని నేతలు ఉన్న వైసీపీలో 60,000 ఎకరాలు అంటే ఎంతో తెలియని వారు ఉంటే ఉండొచ్చు. కానీ 60 వేల ఎకరాల్లో రెండు నగరాలే కట్టొచ్చు. ఒక సంస్థకు అంత భూమిని ఇవ్వడం ఎక్కడైనా జరిగిందా? కానీ వైసీపీ నేతల అబద్దపు ప్రచారాల్లో అలాంటివి… pic.twitter.com/6SPsDDQorX
— Telugu Desam Party (@JaiTDP) April 23, 2025
టీడీపీ కౌంటర్ ఎటాక్..
మొత్తమ్మీద ఎకరా 99 పైసలంటూ వైసీపీ కాస్త వెటకారంగా ఈ ప్రచారాన్ని మొదలు పెట్టగా, దాన్ని సక్సెస్ ఫుల్ గా తమకు అనుకూలంగా మార్చుకుంది టీడీపీ. ఎకరా 99 పైసలకు లీజుకిచ్చే భూముల్లో ఏం జరుగుతోంది, ఎంత అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని వివరిస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు ఉర్సా భూముల కేటాయింపుపై కూడా వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అంటున్నారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టీసీఎస్ సంస్థ 1500 కోట్ల పెట్టుబడితో అక్కడ తమ కార్యకలాపాలు మొదలు పెడుతోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 12వేలమందికి ఉపాధి లభించడంతోపాటు, పరోక్షంగా దాదాపు లక్షమందికి జీవనోపాధి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు నిపుణులు.