OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ ల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ప్రేక్షకులు. వీటిలో ముందుగా మలయాళం సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు తొందర్లోనే ఓటీటీ లోకి వస్తుండటంతో, ఇక వీటిని మిస్ కాకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఒక అమ్మాయి మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. సరదాగా సాగిపోతున్న ఈ సినిమా, ఒక్కసారిగా టర్న్ అవుతుంది. అనుకోని ట్విస్టులతో ప్రేక్షకుల్ని టెన్షన్ పెడుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
మనోరమ మ్యాక్స్ (Manorama MAX) లో
ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కళ్ళం’ (Kallam). 2024 లో విడుదలైన ఈ మూవీకి అనురామ్ దర్శకత్వం వహించారు. ఇందులో కైలాష్, సహీన్ సిద్దిఖీ, జేవ్ బేబీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ 16 ఏళ్ల ప్లస్ వన్ విద్యార్థిని శ్రీకుట్టి హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. ఒకటిన్నర గంట నిడివి ఉండే ఈ మూవీ, ఉత్కంఠ భరితంగా సాగిపోతుంది. 2024 డిసెంబర్ 13 న థియేటర్లలో రిలీజ్ అవ్వగా, నాలుగు నెలల తరువాత ఈ రోజు ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ (Manorama MAX) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
పదహారు ఏళ్ల శ్రీకుట్టి ఇంటర్ చదువుతూ ఉంటుంది. ఈమెకు నియాస్ అనే ప్రేమికుడు కూడా ఉంటాడు. ఇలా ఒక వైపు చదువుతూ,మరోవైపు ప్రేమలో ఉంటూ లైఫ్ సరదాగా గడిచిపోతూ ఉంటుంది. అయితే ఒక రోజు శ్రీకుట్టి తన ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉంటుంది. తనని ఎవరో హత్య చేసి ఉంటారు. పోలీసులు ఈ హత్య పై కేసు నమోదు చేస్తారు. జరిగిన పరిస్థితుల ఆధారంగా ఆమె బాయ్‌ఫ్రెండ్ నియాస్‌పై అనుమానం పడతారు పోలీసులు. ఈ హత్యకు సంబంధించి నియాస్‌ను పోలీసులు ప్రశ్నిస్తారు. అయితే పోలీసులు అతడు ఈ హత్య ఎందుకు చేశాడో, కనిపెట్టలేక పోతారు. ఈ సమయంలో, పేరు పొందిన జర్నలిస్టులు ఆనంద్, షెమిన్ స్వతంత్రంగా ఈ కేసును విచారించడం ప్రారంభిస్తారు. వారు శ్రీకుట్టి హత్యకు సంబంధించిన కొన్ని రహస్యాలను కనుగొంటారు. ఇవి కేసును ఎవరూ ఊహించని మలుపుకి తీసుకెళ్తాయి.
ఈ హత్యకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. సాధారణంగా ప్రారంభమైన కథ అనూహ్యంగా మలుపులు తిరుగుతుంది. చివరికి శ్రీకుట్టిని హత్య చేసింది ఎవరు ? ప్రియుడే చంపాడా ? మరెవరైనా ఈ హత్య చేశారా ? ఎందుకు చేశారు ? అనే విషయాలను, ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ మూవీ దర్శకుడు అనురామ్‌కు, ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు కూడా అందాయి. ఇది ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాలా దర్శకుడు తెరకెక్కించాడు.
Read Also : న్యూక్లియర్ బాంబ్ కంటే ఈ కామెడీ బాంబ్ బాగా పేలింది … కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్