Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సినిమాతో మన ముందుకు రానున్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా.. ఎందుకో ఈ హీరోకి మంచి హిట్ అందుకోలేకపోయారు. అల్లుడు శీను తో 2014లో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టారు. ఈ సినిమాలో సమంత, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జయ జానకి నాయక సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక 2019లో వచ్చిన రాక్షసుడు సినిమా తమిళ్ సినిమా రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి అనుపమ పరమేశ్వరన్ తో జత కడుతున్నట్లు సమాచారం. ఆ సినిమా పేరు వాటి వివరాలు తెలుసుకుందాం..
BSS11 వివరాలు ..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన డైనమిక్ నటనతో హీరోగా తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో భైరవం, టైసన్ నాయుడు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల తరువాత అనుపమ పరమేశ్వరన్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి జతకట్టనున్నాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను డేట్ ని ఫిక్స్ చేశారు మూవీ టీం. ఈనెల 27వ తేదీన సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లుగా మూవీ టీం అనౌన్స్ చేశారు. ఈ మూవీలో హీరో లుక్ తెలియాల్సి ఉంది. రాక్షసుడు సినిమాలో వీరిద్దరూ కలిసి హిట్ పెయిర్ గా నిలిచారు. మళ్ళీ ఈ జంట ఆరేళ్ల తర్వాత అదే యాక్షన్ సీక్వెన్స్ లో సరికొత్త హంగులు జోడిస్తూ కొత్త కథతో రానున్నారని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే రాక్షసుడు సినిమా మాదిరిగా ఈ సినిమా కూడా థ్రిల్లర్ మూవీగా రానున్నట్లు సమాచారం. ఈ మూవీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ సినిమాగా రానున్నది. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. BSS11 ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. షైన్ స్క్రీన్ నిర్మాణంలో ఈ సినిమా రానున్నది. రాక్షసుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్లీ ఈ జంట కలిసి 6 సంవత్సరాల తరువాత వెండితెరపై కనిపిస్తూవుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కూడా సాయి శ్రీనివాస్ కు మరో మంచి విజయాన్ని అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆ సినిమా రీమేక్ ..
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమాలలో అల్లుడు శీను, రాక్షసుడు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కవచం, సీత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోనూ ఛత్రపతి సినిమాను రీమేక్ చేశారు. వి వి వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో విజయాన్ని సాధించలేదు. తన కెరీర్ లో విజయాన్ని అందుకునేందుకు బి ఎస్ ఎస్ 11 తో మన ముందుకు రానున్నారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మరిన్ని సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుందాం.
Something spooky is coming your way to haunt you 🥶#BSS11 FIRST LOOK ON APRIL 27th 💥@anupamahere @Koushik_psk @sahugarapati7 @Samcsmusic @chaitanmusic @chinmay_salaskar_dp @Shine_Screens @UrsVamsiShekar pic.twitter.com/TDA9aCYb90
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) April 25, 2025